ప్రాణాలు పోయినా పట్టించుకోరా ?

Veldandi Saikiran
హైదరాబాద్... దాదాపు కోటి మంది జనాభా ఉన్న మహా నగరం. పెద్ద కంపెనీలు, రవాణా ఇలా చాలా రంగాల్లో దూసుకుపోతున్నారు నగరం. అంతేకాదు కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది హైదరాబాద్. అలాంటి ఈ మహానగరంలో చినుకు పడితే చాలు... ప్రజా జీవనం అస్తవ్యస్త మవుతోంది. బస్తీలో ఉన్న ఇండ్లు వరదల్లో మునిగి పోతున్నాయి. ఇంకా హైదరాబాద్ రోడ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వర్షం పడితే చాలు..  రోడ్లపై గంగా నదిలా వరదలు పారుతు ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మ్యాన్ హోల్ వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది. వర్షం చాలు... మ్యాన్ హోల్ నుంచే.. మురుగునీరు రోడ్లపైకి వస్తుంది. అలాగే ఈ మ్యాన్ హోల్ వ్యవస్థ కారణంగా... సీజనల్ వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా మలేరియా లాంటి విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి.


ఇక బస్తీ ఏరియాల్లో ప్రజలలో దోమల బెడద వేధిస్తోంది. ఈ సమస్య ఇప్పటిది ఏమీ కాదు. ఎన్నో ఏళ్లుగా మ్యాన్ హోల్ వ్యవస్థ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు మ్యాన్ హోల్ వ్యవస్థ కారణంగా... పారిశుద్ధ కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఉదాహరణ వనస్థలిపురం లో జరిగిన విషాదం. మ్యాన్  హోల్ వ్యవస్థ ఇద్దరు జిహెచ్ఎంసి కార్మికులను మింగేసింది. కాంట్రాక్టు ఒత్తిడి మరియు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఇద్దరు కార్మికులు మరణించారు. మ్యాన్ హోల్ క్లీన్ చేయడానికి దిగిన ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు... ఊపిరి ఆడక మృతి చెందారు. ఇందులో శివ అనే జిహెచ్ఎంసి కార్మికుడి శవాన్ని వెలికితీసిన సహాయక బృందం... అనంతయ్య శవం కోసం గాలిస్తోంది. అయితే ఇప్పటివరకు జిహెచ్ఎంసి కమిషనర్ గాని, జిహెచ్ఎంసి మేయర్ గాని ఘటనా స్థలానికి రాలేదని తెలుస్తోంది. ప్రజల ప్రాణాలు కాపాడే... పారిశుద్ధ కార్మికులు చనిపోతే.. అధికార యంత్రాంగం ఇలా వ్యవహరించడం చాలా దారుణమని విపక్షాలు మండిపడుతున్నాయి.


మనుషులు చనిపోతున్నా చీమకుట్టినట్లు కూడా అధికారులు వ్యవహరించడం లేదని నిప్పులు జరుగుతున్నాయి విపక్షాలు. అయితే.. ఇలాంటి ఘటనల్లో ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ ఈ ఘటనలో ఆడవిడి ఏమీ కనిపించడం లేదు. ఇలా అయితే... పారిశుద్ధ కార్మికులు ఆదుకునేది ఎవరు అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. అలాగే ప్రజలు కూడా ఇష్ట రీతిన.... చెత్తను మ్యాన్ హోల్ లో పడేయడం కూడా బాధ్యతా రాహిత్యం అవుతుంది. ఈ ఇద్దరి పారిశుద్ధ కార్మికుల మరణానికి..ప్రభుత్వ యంత్రాంగం ఎంత బాధ్యత వహించాలో.. ప్రజలు కూడా అంతే వహించాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: