ఆ జిల్లాలో కరోనా జోరుకు కళ్లెం పడేనా ?

VAMSI
కరోనా అనే చీడ పురుగు ఈ నేలపైకి వచ్చి దాదాపుగా రెండేళ్లు గడుస్తోంది. అయినా ఈ మహమ్మారి శాంతించడం లేదు దశలవారీగా దండయాత్రలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. చిన్న.. పెద్ద,పేద... ధనిక అని తేడా లేని ఈ వైరస్ ను చూసి మొత్తం యావత్ ప్రపంచమే వణికిపోతుంది. ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్న వారిపై సైతం ఈ మహమ్మారి మళ్లీ దాడి చేయగలదు. ఇప్పటికే పలువురు టీకాలు తీసుకున్న వారికి సైతం వైరస్ సోకింది అన్న వార్తలు మనుషుల మనుసుల్ని కుదిపేస్తున్నాయి. అసలు ఈ మహమ్మారి ఈ ప్రపంచాన్ని వీడి ఎప్పుడూ మాయమవుతుంది అన్న విషయం కనీసం అంచనాలు వేయడానికి కూడా సాధ్యపడటం లేదు.

మొదటి దశలో విజృంభించిన కరోనా అనంతరం లాక్ డౌన్ లు, కఠిన నిబంధనలు వంటివి పాటించడంతో కాస్త శాంతించింది. మళ్లీ కాస్త వైరస్ దాడి తగ్గింది కదా అని ప్రజలు అలా రోడ్లపైకి రావడం మొదలు పెట్టారు. అంతే మళ్లీ కరోనా సెకండ్ వేవ్ అంటూ ఓ రేంజ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మొదటి దశకు మించి తీవ్రత పెరగడంతో ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. మరెంతో మంది తమ ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక మళ్లీ లాక్ డౌన్ లు వంటి ఆంక్షలు కఠిన తరం చేయగా కాస్త వ్యాప్తి తగ్గింది. లాక్ డౌన్ సడలింపులతో తిరిగి ప్రజలు కాస్త స్వేచ్ఛగా తిరగడం మొదలు పెట్టారో లేదో నేను ఏమైనా తక్కువ అన్నట్లుగా మళ్లీ పగ పట్టిన పాములా వెంటాడి వేధిస్తోంది ఈ మహమ్మారి.

ప్రస్తుతం దేశంలో కరోనా ఉదృతి మళ్లీ వేగం పుంజుకుందనే చెప్పాలి. ఇటు ఆంధ్రరాష్ట్రంలోనూ కరోనా వ్యాప్తి శరవేగంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజురోజుకీ తీవ్రత పెరుగుతూనే వుంది. పరిస్థితిని చూస్తే కరోనా థర్డ్ వేవ్ మొదలయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. జిల్లాలలో ఈ వైరస్ వ్యాప్తి వేగం చూస్తుంటే నిజంగా మూడవ దశ మొదలయినట్టే అని కలవరం కలుగుతోంది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజుకు రెండు వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఒక్కసారిగా పెరుగుతోంది. ముఖ్యంగా నిన్నటి కరోనా గణాంకాలు చూడగా చిత్తూరు జిల్లాలో అధిక కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ జిల్లాలో వైరస్ తీవ్రత వేగంగా పెరుగుతోందని చెప్పాలి. ఓ వైపు మళ్లీ లాక్ డౌన్ నిబంధనలను కొద్దిగా కొద్దిగా మళ్లీ పటిష్ఠం చేస్తోంది. అయినా కేసులు  క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: