భారత శిక్షణ పనిచేయలేదు.. తాలిబన్లు అరాచకం?
అదే సమయంలో అటు ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ సంఖ్య రెండున్నర లక్షల వరకు ఉంటుంది. అయినప్పటికీ ఇక ఆఫ్ఘనిస్తాన్ సైనికుల్లో తాలిబన్లు సృష్టించిన భయం.. ధైర్యంగా పోరాడటానికి ముందుకు రానివ్వడం లేదు. ఇలా సైన్యంలో భయాన్ని సృష్టిస్తూ రోజురోజుకు తాలిబన్లు రెచ్చిపోతున్నారు. అయితే అఫ్ఘనిస్తాన్ సైన్యానికి అటు భారత్ ఎంతో కఠినమైన శిక్షణ ఇచ్చింది. అదే సమయంలో మరో వైపు నుంచి అగ్రరాజ్యమైన అమెరికా నుంచి పూర్తిస్థాయి తోడ్పాటు కూడా అందుతుంది. అయినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ సైన్యంలో తాలిబన్లు అంటే ఉన్న భయం మాత్రం పోవడం లేదు.
ఇక ఎన్నో అరాచకాలు సృష్టించి ప్రభుత్వాన్ని గద్దె దించి తమ ఆధీనంలో ఉన్న ప్రభుత్వాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో ప్రస్తుతం తాలిబన్లు ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. హెరాక్ తో పాటు మూడు నగరాలను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడానికి రాగా.. ఇక ఎంతో మంది సైనికులు ధైర్యంగా ఇక తాలిబన్లను ఎదుర్కోవడానికి వచ్చారు. ఈ క్రమంలోనే వాళ్లను బంధించి పీకలు కొయ్యడం లేదా దారుణంగా కాల్చి వేయడం లాంటివి చేసి.. వీడియో తీసి అక్కడి సోషల్ మీడియాలో వైరల్ గా చేసి ఇక అందరిలో మరింత భయాన్ని సృష్టించేందుకు తాలిబన్లు వ్యూహాలను అమలు చేస్తున్నారు. అంతేకాదు ఇక తమ మాట వినకపోతే ఇంట్లో ఉన్న ఆడవాళ్లను కూడా చంపేస్తాం అంటూ బెదిరిస్తూ ఆఫ్ఘనిస్థాన్లో అల్లకల్లోల పరిస్థితులు సృష్టిస్తున్నారు తాలిబన్లు.