కృష్ణమ్మ పరవళ్లు.. వాళ్లకు సీరియస్ వార్నింగ్...?

Chakravarthi Kalyan

కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది.. బిరాబిరా కృష్ణమ్మ కదలివస్తోంది. ఈసారి గతేడాది కన్నా త్వరగానే కృష్ణమ్మ పరుగులు పెట్టింది. జూలై చివరి వారం... ఆగస్టు మొదటి వారంలోనే శ్రీశైలం, సాగర్ నిండే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండు జలాశయాలు పూర్తిగా నిండి కిందికి నీటిని వదిలేయాల్సిన పరిస్థితి. అటు ఈ ప్రవాహంతో పులిచింతల కూడా పూర్తిగా నిండంది. ఈ ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల  చేస్తున్నారు.


ప్రస్తుతం పులిచింతల ఔట్ ఫ్లో లక్షా 13వేల క్యూసెక్కులుగా ఉంది. ఎగువ నుంచి పులిచింతలకు లక్షా 13 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 11 వేల 867క్యూసెక్కులు మళ్లిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 41.83 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలుగా ఉంది. ఎగువ నుంచి కృష్ణానదికి  పెరుగుతున్న వరద ఉధృతి కారణంగా అన్నిచోట్లా నీటిని వదిలేస్తున్నారు.


పై నుంచి  నీరు బాగా వదలడంతో ప్రకాశం బ్యారేజ్ కు సుమారు 5 లక్షల క్యూసెక్స్ వరకు చేరే అవకాశం కనిపిస్తోంది. ఈ వరద ఉధృతితో అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ నివాస్ మరింత అప్రమత్తం చేశారు. సోమవారం ఉదయం 7.00 లకు పులిచింతల ప్రాజెక్ట్ వద్ద 3,56,486 ఇన్‌ ఫ్లో ఉంటే.. దాదాపు అంతే ఔట్‌ ఫ్లో కూడా ఉంది. ప్రస్తుతo  ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో 57,674 క్యూసెక్కులు అవుట్ ఫ్లో 48,425 క్యూసెక్కులుగా ఉంది.


కృష్ణమ్మ ఎగువ నుంచి ఇంకా వరద వచ్చే అవకాశం ఉండటం వల్ల వరద ముంపు ప్రభావిత   అధికారులను కలెక్టర్ మరింత అప్రమత్తం చేశారు. జగ్గయ్యపేట  నుంచి ఇబ్రహీంపట్నం వరకు 18 మండలాల తహసీల్దార్ల్  అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన లంక, పెద లంక ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదంటున్నారు అధికారులు. వరద నీటిలో ఈతకు  వెళ్ళడం, పశువులు-గొర్రెలు వదలడం చేయవద్దని కలెక్టర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: