ఎస్బిఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇక ఆ ఛార్జ్ లేదు?

praveen
ప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగంలో దిగ్గజ బ్యాంకుగా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు వినూత్న మైన సేవలు అందించడంలో ముందుంది. ఒకవైపు కొత్త కస్టమర్లను ఆకర్షిస్తూనే మరోవైపు తమ కస్టమర్లకు ఎంతో నాణ్యమైన సేవలు అందిస్తూ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.ఎస్బీఐ కస్టమర్లు అందరికీ ఎంతో అధునాతనమైన సేవలు అందిస్తూ బ్యాంకింగ్ రంగంలో పోటీని తట్టుకుంటూ టాప్ లో దూసుకుపోతుంది. క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్ డ్రాయల్, ఏటీఎం, యూపీఐ లాంటి ఎన్నో రకాల సర్వీసులను అందిస్తుంది. అంతేకాకుండా ఇక అటు కస్టమర్ల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కూడా ప్రస్తుతం ఎన్నో రకాల స్కీమ్స్ అందుబాటులో ఉంచింది.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎడ్యుకేషన్ లోన్స్, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల రుణ సదుపాయాలను ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచింది. అయితే మొన్నటి వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ఎవరైనా ఏదైనా లోన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా  ఇక  లోన్ ప్రాసెసింగ్ కోసం ఒక ప్రత్యేకమైన చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. దీనినే లోన్ ప్రాసెసింగ్ ఫీజు అని అంటూ ఉంటారు అయితే ఈ లోను ప్రాసెసింగ్ ఫీజు ద్వారా మొన్నటివరకు కస్టమర్లు కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. లోన్ ప్రాసెసింగ్ ఫీజు విషయంలో ఇక అటు తమ ఖాతాదారులు అందరికీ కూడా ఒక శుభవార్త చెప్పింది.



 ఆగస్టు 1వ తేదీ నుంచి గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆగస్టు నెల ఆఖరి వరకూ తీసుకునే రుణాలపై ఇది వర్తిస్తుంది అంటూ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం గృహ రుణ మొత్తం పై 0.40 శాతం ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కానీ ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ నెలాఖరు వరకు కూడా ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే హోమ్ లోన్స్ ఇచ్చేందుకు నిర్ణయించింది. మాన్సూన్ ధమాకా పేరుతో ఈ ప్రాసెసింగ్ ఫీజు ని రద్దు చేసింది. ప్రస్తుతం 6.70 వడ్డీ రేటు హోమ్ లోన్స్ అందిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బిఐ  yono యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి 0.5% వడ్డీ రాయితీ అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: