చంద్రబాబు బాటలోనే జగన్ !
కాదనకున్నా నిన్నటి వేళ వైసీపీ దాడి చేసిందని చెబుతున్న తీరు ఓ విధంగా ప్రభుత్వ తప్పిదమే! లేదా కార్యకర్తల అత్యుత్సాహ డమే కావొచ్చు. నాడు టీడీపీ హయాంలో కానీ ఇప్పుడు వైసీపీ హయాంలో కానీ ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న దాఖలా లు లేవని కాదు కానీ ఒకరి దారిలో మరొకరు నడిచి సాధించేది ఏమీ ఉండదు అని చెప్పడమే ఇక్కడ ప్రధానోద్దేశం. ఏదేమైనప్పటి కీ వ్యక్తిగతం వేరు రాజకీయం వేరు అనేందుకు లేదు..ఈ రెండూ ఒక్కటే..అలా చంద్రబాబు బాటలోనే జగన్ నడుస్తున్నారా.. అరె స్టుల పర్వంతో ఆయనేమయినా సాధించేది ఉందా? అన్నది ఒక వాదన వినవస్తుంది. రాజకీయంగా అటు దేవినేని ఉమ ఎప్పటి నుంచో క్రియాశీలకంగా ఉంటున్నారు. తనదైన పంథాలో ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు.అయితే నిన్నటి దాడి ని మాత్రం ఎవ్వరూ ఒప్పుకోరు.
మైనింగ్ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన ఓ ప్రజాప్రతినిధిపై దాడి ఎవ్వరూ ఒప్పుకోరు. ఒకప్పుడు కొన్నిచోట్ల టీడీపీ హయాం లో వైసీపీపై దాడులు జరిగాయన్నది వాస్తవం. అదే సీన్ ను మళ్లీ మళ్లీ గుర్తుకువచ్చేలా జగన్ పార్టీ సభ్యులు ప్రవర్తించడం సబ బు కాదు. ఒకవేళ మైనింగ్ అక్రమాలు లేవనుకుంటే ఆధారాలతో సహా నిరూపించాల్సిన బాధ్యత ఏపీ సర్కారుదే కానీ ఆ పని చే యకుండా సీనియర్ లీడర్ పై దాడి అన్నది వైసీపీ చేసిన తప్పిదంలానే అనిపిస్తుంది. కొండపల్లిలో ఏం జరుగుతుంది ... అసలు మైనింగ్ అన్నది జరగడం లేదా?జరిగితే అందుకు కారణం ఏంటి? ఇవికదా ఎమ్మెల్యే చెప్పాలి...కానీ వీటిపై స్పష్టంగా మా ట్లాకుం డా దాడికి సంబంధించిన కారణాలేవీ చెప్పకుండా కేవలం టీడీపీ అబద్ధాలను నిజంచేయాలనుకుంటుంది అని చెప్పడం సబబు కాదు.