ప్రభుత్వాన్ని కాపాడుకోలేక పోతున్న సీఎం...? కూలిపోయినట్టే...?
ఇక నేడు ఉదయం పార్టీ ఎమ్.ఎల్.ఏ ల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు రాజస్థాన్ పిసిసి అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా. అయితే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ తో పాటు, పార్టీ పదవులను సత్వరమే భర్తీ చేయాలని సచిన్ పైలెట్ వర్గం కోరుతోంది. మొత్తం 30 మంది మంత్రులు ఉండాల్సిన రాష్ట్ర మంత్రి మండలిలో, ప్రస్తుతం ముఖ్యమంత్రి తో సహా కేవలం 21 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. ఇక మిగిలిన 9 మంది మంత్రుల ఖాళీలను నియామకం చేసే అంశం పై దృష్టి పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. రాష్ట్ర రాజకీయాలపై ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తో అన్ని విషయాలను మాట్లాడుతున్నానని సచిన్ పైలట్ అంటున్నారు.
సాధ్యమైనంత త్వరలోనే పార్టీ అధిష్ఠానం తగు రీతిలో సరైన నిర్ణయాలు తీసుకుంటుందనే ఆశాభావం తో ఉన్నానని సచిన్ పైలట్ ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో సచిన్ పైలట్ కు చేసిన వాగ్దానాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని ఆయన వర్గానికి చెందిన ఎమ్యెల్యేలు కోరుతున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు వ్యతిరేకంగా, గత ఏడాది సచిన్ పైలట్ నేతృత్వంలో 18 మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు ఎదురు తిరిగిన సంగతి విదితమే. తాజాగా మరోసారి తమ దిక్కార స్వరం వినిపస్తున్నారు సచిన్ పైలట్ వర్గ ఎమ్యెల్యేలు. ఇందులో భాగంగానే తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరుతున్నారు సచిన్ పైలట్ అనుయాయులు.