జొమాటో పేరు వెనుక ఇంత స్టోరీ ఉందా?

praveen
ప్రస్తుతం ఆన్లైన్ యుగం నడుస్తుంది. ఏది కావాలన్నా అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో దొరుకుతుంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా తమకు కావలసిన వస్తువులు ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. అయితే ఒకప్పుడు ఏదైనా ఆహారం తినాలనిపిస్తే వెంటనే రెస్టారెంట్ కి వెళ్ళి తమకు నచ్చిన ఆహారాన్ని తీసుకునే వారు.. కానీ ఇప్పుడు మాత్రం అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఇక ఇంట్లోనే హాయిగా కూర్చుని ఒక్క క్లిక్ తో తమకు కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక తమకు నచ్చిన ఆహారాన్ని ఇంటి ముంగిటి వరకు తెచ్చిస్తున్నారు. అయితే ఇలా ఎంతో మంది కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేయడానికి ఎన్నో రకాల సంస్థలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కోట్ల మంది కస్టమర్లకు సేవలు అందిస్తుంది.



 చిన్న సంస్థగా మొదలైన జొమాటో ఇక ఇప్పుడు ఏకంగా ఫుడ్ డెలివరీ రంగంలో టాప్ ప్లేస్లో కొనసాగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవలే ప్రస్థానాన్ని ప్రారంభించి 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ 13 ఏళ్లలో ఎంతో సాధించింది జొమాటో .  అత్యంత వేగంగా డెలివరీ ఎందులో అందుతుంది అని అడిగితే ప్రతి ఒక్కరు జొమాటో అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీపిందర్, పంకజ్ అనే ఇద్దరు కుర్రాళ్ళు ఢిల్లీలో ఈ సంస్థను మొదలుపెట్టారు. అయితే ఈ సంస్థకు మొదట వేరే పేరు ఉండేది. కానీ ఆ తర్వాత జోమటో అని పేరు మార్చారు. అయితే ఇలా జొమాటో  అని పేరు మార్చడానికి వెనుక పెద్ద స్టోరీ ఉంది.



 తొలుత 13 ఏళ్ల క్రితం ఈ సంస్థను స్థాపించిన అప్పుడు ఫుడ్ బే. కామ్ అనే పేరుతో డెలివరీ సేవలు అందించారు. అయితే ఈ పేరు అంతగా కస్టమర్లను ఆకట్టుకోలేదు. దీంతో ఇక ఈ సంస్థకు పేరు మార్చాలి అని అనుకున్నారు. ఈ క్రమంలోనే 2010 సంవత్సరంలో జోమాటో గా నామకరణం చేశారు. అయితే జొమాటో అనే పదం రావడానికి వెనుక చిన్న స్టోరీ ఉందట. టమాటో పదాన్ని ఆధారంగా చేసుకుని జోమాటో పదాన్ని పెట్టారంట. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో వంటకంలో టమాటో ఉంటుంది. ఇక ప్రతి ఒకరికి జొమాటో సేవలు అందిస్తుంది అనే ఉద్దేశంతో టమాటో పేరు మారుస్తూ జమాటో అని పేరు పెట్టారట. ఈ పేరు ఆ ఇద్దరు కుర్రాళ్లను తెగ ఆకర్షించడంతో జొమాటో పేరు పెట్టారు. ఇది ప్రస్తుతం ఫుడ్ డెలివరీ లో టాప్ లో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: