ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం దేశమంతా ఇతని పైనే చర్చ జరుగుతోంది. ఎవ్వరికీ అంతు చిక్కని వ్యూహాలతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించి తనను నమ్మిన రాజకీయ పార్టీలను అధికారంలోకి తీసుకొస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు ఇందులో ఇతనిది పైచేయిగా ఉంది. ఇతని సామర్ధ్యానికి ఫిదా అయిన చాలా రాష్ట్రాలు ఇతని సేవలను ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చారు. స్వతహాగా ప్రశాంత్ కిషోర్ ఐఐటి లో ఉతీర్ణుడయ్యాడు. కానీ రాజకీయాలంటే అమితమైన ఆసక్తి. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు గుజరాత్ లో అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని ఎలాగైనా పీఎంని చేయాలనే ఒక సంకల్పంతో క్షేత్ర స్థాయిలో గట్టిగా పనిచేసి అనుకున్న విధముగానే తన బలమైన రాజకీయ వ్యూహాలతో నరేంద్ర మోదీని పీఎంగా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఈ ఒక్క సంఘటనతో పీకే క్రేజ్ మరింత పెరిగింది.

ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లో 2019 లో జరిగిన ఎన్నికలలో వైసీపీ కి అన్నివిధాలుగా అండగా ఉండి, తన రాజకీయ వ్యూహాలతో అధికారాన్ని తెచ్చి జగన్ ను సీఎం కుర్చీ ఎక్కేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఆ తరువాత మొన్న జరిగిన వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లోనూ దీదీ పీకే సహాయంతో మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే పీకే రాజకీయ పార్టీలు మాత్రమే అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతున్నాడు. కానీ దేశానికి మరియు దేశంలోని పౌరులను అన్యాయం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎలా అన్యాయం చేస్తున్నారో తెలుసా ? పీకే అండతో గెలిచిన రాష్ట్రాలను ఒకసారి పరిశీలిస్తే ఇదొక సమస్యతో ఇబ్బంది పడుతున్నాయని అంటున్నారు రాజకీయ వాదులు. ఉదాహరణకు ఏపీని తీసుకుంటే, పీకే ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించడానికి ఉచిత హామీలను ప్రజలకు ఇస్తున్నారు. తద్వారా ఆ హామీలను నిలబెట్టుకునేందుకు ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని ఖజానా అంతటిని వాడేశాడు. అది చాలక అప్పులు కూడా చేస్తున్నాడని టాక్ వచ్చిన మాట తెలిసిందే.
అదే విధంగా వెస్ట్ బెంగాల్ పరిస్థితి తీసుకుంటే అక్కడ కులాలను కేద్రంగా చేసుకుని తన సర్వే చేయడంతో క్షేత్ర స్థాయి నుండి కులాల చిచ్చు మొదలై ఎంతటి ఘోర పరిస్థితులు జరిగాయో మనము కళ్లారా చూశాము. ఇలా పీకే వల్ల రాజకీయ పార్టీలకు ప్రయోజనమే తప్పా ? రాజకీయ నాయకులను నమ్ముకున్న అమాయక ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పీకే వల్ల దేశ ప్రజలు నష్టపోయే ప్రమాదముందని రాజకీయ వర్గాలు ఘోషిస్తున్నాయి. మరి ఇకముందైనా ప్రజలను గెలవడానికి, రాజకీయ నాయకులు ప్రజలకు ఉచితంగా ఇచ్చే పనికి రాని హామీలు ఇవ్వడం కాదు. వారికి భవిష్యత్తు బాగుపడడానికి తీసుకునే మంచి మంచి నిర్ణయాలు అని తెలుసుకోండి. అప్పుడే దేశం బాగుపడుతుంది.