బాబోయ్.. కరోనా.. మళ్లీ పంజా విప్పుతోంది..?

Chakravarthi Kalyan
ఇప్పటికే కరోనా కట్టడి వైఫల్యం.. పెట్రో ధరల పెంపు వంటి ప్రజాప్రతికూల అంశాల విషయంతో ప్రతిష్ట మసక బారిన మోడీ సర్కారు మెడకు మరో  గుదిబండ ఫోన్ల హ్యాకింగ్‌ అంశం రూపంలో ఎదురైంది. మూడేళ్ల క్రితం కొందరు కీలక నేతలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, భద్రతా సంస్థల ప్రస్తుత, మాజీ అధిపతుల ఫోన్లను హ్యాకింగ్‌ చేశారన్న ఆరోపణలు ఇప్పుడు ఆధారాలతో సహా వెలుగు చూస్తున్నాయి. ఈ హ్యాకింగ్‌కు గురైన జాబితాలో పేర్లు చూస్తే అవాక్కవ్వక తప్పదు.


ఎందుకంటే ఏకంగా మోదీ ప్రస్తుత కేబినెట్‌లోని ఇద్దరు మంత్రుల పేర్లు కూడా హ్యాకింగ్‌కు గురైన జాబితాలో ఉన్నాయి. ముగ్గురు కీలక విపక్ష నేతలు, సుప్రీం కోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తి ఫోన్లు కూడా హ్యక్ అయ్యాయట. మరో  40మంది జర్నలిస్టులు, కొందరు వ్యాపారవేత్తల పేర్లు కూడా హ్యాకింగ్ జాబితాలో ఉన్నాయి. ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌తో 2018-19 మధ్య ఈ హ్యాకింగ్‌ అరాచకం జరిగిందని.. ప్రముుఖ పత్రిక ది వైర్‌ సంచలనాత్మక కథనం ప్రచురించింది. ఇజ్రాయెల్‌లోని ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ కంపెనీకి చెందిన పెగాసస్‌ అనే స్పైవేర్‌ సాయంతో ఈ హ్యాకింగ్‌ జరిగిందట.


సరిగ్గా పార్లమెంటు సమావేశాల సమయంలో పేలిన ఈ హ్యాకింగ్ బాంబు.. పార్లమెంటును కుదిపేసే అవకాశం కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రపంచ వ్యాప్తంగా ఈ టెక్నాలజీని ప్రభుత్వాలకు అందిస్తోంది. నిఘా కార్యకలాపాల కోసం ఈ టెక్నాలజీని ప్రభుత్వ సంస్థలకు ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ అమ్ముతుంటుంది. అందుకే ఇఫ్పుడు వెలుగు చూసిన ఈ హ్యాకింగ్‌ వ్యవహారంలో ప్రభుత్వం పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.


పెగాసస్‌ స్పైవేర్‌ తో లక్ష్యంగా చేసుకున్నవారి జాబితాలో 300 మందికి పైగా భారతీయులు ఉన్నారని వైర్ కథనం చెబుతోంది. వారందరి ఫోన్‌ నంబర్లు తాజా డేటాబేస్‌లో అందుబాటులో ఉన్నయట. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, న్యాయ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు, హక్కుల కార్యకర్తల వంటి వారు కూడా హ్యాకింగ్ చేయబడిన బాధితుల జాబితాలో ఉన్నారని వైర్ కథనం చెబుతోంది. ప్రత్యేకించి... 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు.. 2018-19 సంవత్సరాల మధ్య వీరి ఫోన్లు హ్యాకింగ్ చేశారట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: