సెల్ఫీ తీసుకో బోతే.. ఎంత అనర్థం జరిగిపోయింది?
దీంతో సెల్ఫీ పిచ్చి ద్వారా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. సెల్ఫీ తీసుకోవాలని పిచ్చి లో ఎంతోమంది ప్రమాదాలను కూడా లెక్క చేయడం లేదు. ఈ క్రమంలోనే ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లి సెల్ఫీ తీసుకోవాలి అని భావించి చివరికి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా సెల్ఫీ పిచ్చి కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఇక ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారు. ఇలా సెల్ఫీల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నప్పటికీ ఎవరిలో కూడా కనీసం జాగ్రత్త తీసుకోవాలి అని అవగాహన మాత్రం రావడం లేదు.
ఇక్కడ సెల్ఫీ పిచ్చి ఏకంగా ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. సెల్ఫీ తీసుకోవాలనే ఆత్రుత సంతోషంగా సాగిపోతున్న జీవితాన్ని చావుకు దగ్గరగా చేసింది. ఉత్తర ప్రదేశ్ లో ఇటీవలే ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పడవలో కొంతమంది అమ్మాయిలు ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వారి మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఈ మధురమైన క్షణాన్ని సెల్ఫీ లో బంధిస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా జేబులో ఉన్న సెల్ఫోన్ తీసి సెల్ఫీ కి ఫోజులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అందరూ ఒక వైపుగా వచ్చారు. దీంతో పడవ కాస్త బోల్తా పడిపోయింది. దీంతో పడవలో ఉన్న ఏడుగురు నీటిలో మునిగిపోయారు. ఇక నలుగురు ప్రాణాలతో బయట పడగా ముగ్గురు చివరికి ప్రాణాలు కోల్పోయారు.