
ఇండియాలో మొదట తెల్లవారే గ్రామం.. ఎక్కడో తెలుసా?
ఇతర దేశాల్లో మాత్రమే కాదు మన దేశంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మిగతా ప్రాంతాలతో పోలిస్తే కాస్త సమయం తేడా ఉంటుంది అని చెబుతున్నారు నిపుణులు. కొన్ని ప్రాంతాలలో అందరికంటే ముందుగా సూర్యాస్తమయం జరిగితే కొన్ని ప్రాంతాలలో అందరికంటే ముందుగా సూర్యోదయం జరుగుతూ ఉంటుంది. మన దేశంలో ఇక అన్ని ప్రాంతాల కంటే ముందుగా సూర్యకిరణాలు తాకే ప్రదేశం ఏది అన్నది చాలామందికి తెలియదు. అందరికంటే ముందుగా సూర్యోదయాన్ని చూసే గ్రామం ఎక్కడ అన్నది కూడా తెలియదు. అయితే దేశంలో అందరికంటే ముందే సూర్య కిరణాలు తాకి తెల్లవారే నిద్ర లేసే గ్రామం పేరు దొంగ్.
ఈ గ్రామం అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. భారతదేశంలో తొలి సూర్యకిరణాలు ఈ దొంగ్ గ్రామాన్ని తాకుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇక ఈ దొంగ్ గ్రామం పర్యాటక ప్రాంతంగా మారిపోయింది ఇక్కడికి వెళ్లి దేశంలోనే తొలి సూర్యకిరణాలను ఆస్వాదించడానికి టూరిస్టులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఉదయం సమయంలో అక్కడికి పర్యటకులు భారీగా వెళుతూ ఉంటారు. అయితే గ్రామానికి వెళ్లడానికి రోడ్డు మార్గం లాంటివి ఏమి ఉండవు. ట్రెక్కింగ్ చేస్తూ అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. దొంగ్ గ్రామంలో సూర్య కిరణాలతో అక్కడి కొండ ప్రాంతాలు మొత్తం నారింజ రంగులో టూరిస్టులను కనువిందు చేస్తూ ఉంటాయి. అంతే కాకుండా సాయంత్రం నాలుగు గంటల సమయంలోనే అక్కడ ఇక సూర్యాస్తమయం జరుగుతూ ఉంటుంది.