గిన్నిస్ బుక్ రికార్డు పై కన్నేసిన ఆవు?

frame గిన్నిస్ బుక్ రికార్డు పై కన్నేసిన ఆవు?

praveen
సాధారణంగా వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డు సాధించాలని అందరూ ఆశ పడుతూ ఉంటారు.  కానీ గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించడం అంటే అదేమైనా అంత ఆషామాషీ విషయమా చెప్పండి. ఇక ప్రపంచంలో ఎవరికీ లేని ఒక ప్రత్యేకమైన ప్రతిభ మనకు ఉండాల్సి ఉంటుంది.  అలాంటి ప్రతిభ మన సొంతం అయినప్పుడే ప్రపంచ గిన్నిస్ బుక్ లో ఇక మన పేరు లిఖించు కోవడానికి అవకాశం ఉంటుంది.  అందుకే వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డులో ఇక తమ పేరును లిఖించు కోవడానికి  ఎంతోమంది ఎన్నో ఏళ్ల నుంచి కఠినంగా శ్రమిస్తూ ఉంటారు  ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా సరికొత్త టాలెంట్ ప్రదర్శిస్తూ గిన్నిస్ బుక్ రికార్డులను కొల్లగొడుతూ ఉంటారు.




 ఇలా ఇప్పటివరకు ఎంతోమంది తమ అరుదైన టాలెంటుతో గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్న వారు ఉన్నారు. ఇక మరికొంతమంది గిన్నిస్ బుక్ లో చోటు తగ్గించుకోవడానికి ఎన్నో రోజుల నుంచి శ్రమిస్తున్న వారు కూడా ఉన్నారు . అయితే గిన్నిస్ బుక్ లో కొన్ని కొన్ని సార్లు మనం ఏమి చేయకుండానే చోటు దక్కుతూ ఉంటుం.ది ప్రపంచంలోనే ఎత్తైన మనిషిగా ఉన్నప్పుడు లేదా ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తు ఉండడం లాంటివి జరిగినప్పుడు కూడా గిన్నిస్ బుక్ లో రికార్డులు సృష్టిస్తూ వుంటారు. కేవలం మనుషులకే కాదు  జంతువులు కూడా ఇలా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి.



 అయితే ఇటీవలే ఒక ఆవు గిన్నిస్ బుక్ రికార్డు పై కన్నేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలో చూస్తున్న ఒక లేగదూడ ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తున ఆవుగా రికార్డులో స్థానం సంపాదించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆవు ఎత్తు ఎంతో తెలుసా.. కేవలం ఇరవై ఒక్క అంగుళాలు మాత్రమే. ఇక దీని బరువు 26 కిలోలు ఉంటుంది. ఇక ఈ అరుదైన ఆవు బంగ్లాదేశ్ చరిగ్రామ్ గ్రామంలో ఉంది. భూటాన్ జాతికి చెందిన ఈ ఆవును రాణి అని అక్కడి ప్రజలు ప్రేమగా పిలుస్తూ ఉంటారు. ఇప్పటివరకు ప్రపంచంలోనే అతి చిన్న ఆవుగా భారత్కు చెందిన మాణిక్యం అనే ఆవు గిన్నిస్ బుక్ లో రికార్డు సృష్టించింది. మాణిక్యం అనే ఆవు 24 అంగుళాల ఎత్తు ఉండేది. కానీ ప్రస్తుతం బంగ్లాదేశ్కు చెందిన రాణి అనే ఆవు 21 అంగుళాల ఎత్తు ఉండటంతో మాణిక్యం రికార్డును బ్రేక్ చేసి సరికొత్త రికార్డును సృష్టించటంపై కన్నేసింది రాణి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: