జగన్ చెప్పారు.. మోడీ చేశారు.. రఘురామ షాకింగ్ కామెంట్స్?
ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం విషయంలో అటు కేంద్రం కల్పించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి ప్రాజెక్టుల మీద కేంద్రం గెజిట్ విడుదల చేయడం సంచలనం గా మారిపోయింది. ఆయా ప్రాజెక్టుల బోర్డులదే తుది నిర్ణయం అంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇటీవల కేంద్రం తెలుగు రాష్ట్రాల నీటి ప్రాజెక్టులపై గెజిట్ విడుదల చేయడంపై వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఈ సందర్భంగా కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు రఘురామకృష్ణంరాజు. ఇటీవలే ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన అటు జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదం విషయంలో జగన్ ఆదేశించారు.. కేంద్ర ప్రభుత్వం పాటించింది అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అంటూ వ్యాఖ్యానించారు రఘురామకృష్ణంరాజు. షెడ్యూల్ తొమ్మిది పది లోని కార్పొరేషన్ల విభజన ఇంకా పెండింగ్లోనే ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ఇప్పటికైనా దీనిపై స్పందించి కార్పొరేషన్ ల విభజనపై ఉన్నత స్థాయి కమిటీ వేయాలని డిమాండ్ చేశారు రఘురామకృష్ణంరాజు. అయితే ఇప్పటివరకు విభజన చట్టంలో ఎన్నో అంశాలు పెండింగ్లో ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.
అంతేకాదు ఇటీవలే తెలుగు భాషను పేక ముక్కలతో పోల్చిన లక్ష్మీపార్వతి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాషను పేక ముక్కల తో పోల్చడం ఏమాత్రం సరికాదు అంటూ వ్యాఖ్యానించారు. లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు కేవలం జూదరులకు మాత్రమే నచ్చుతాయని కానీ మిగతా వారికి ఎవరికీ నచ్చవు అంటూ వ్యాఖ్యానించారు. ఇక జగన్ బెయిల్ పిటిషన్ రద్దు కాదు అని సిపిఐ నారాయణ చెబుతున్నారు. అయితే బెయిల్ పిటిషన్ రద్దు కాదు అంటూ సీపీఐ నారాయణ చెప్పిన జోస్యం 100% తప్పు అవుతుంది అంటూ వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల జల వివాదం విషయంలో రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.