తప్పతాగి నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. చివరికి?

praveen
ఇటీవలి కాలంలో ఎంతో మంది ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎన్నో ప్రమాదాలకు కారణమవుతున్నారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రైల్వే శాఖలో పనిచేస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎన్నో దారుణమైన ప్రమాదాలకు కారణం కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్టేషన్ మాస్టర్లు ఎంతలా అలర్ట్ గా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇటీవల స్టేషన్ మాస్టర్ నిర్లక్ష్యం కారణంగా పెద్ద ప్రమాదం జరిగేది. కానీ అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.

 అంతేకాదు స్టేషన్ మాస్టర్ నిర్వాకం కారణంగా నార్త్ సెంట్రల్ రైల్వే పరిధిలోని ఢిల్లీ హౌరా మధ్య కొన్ని గంటలపాటు సేవలకు ఏర్పడే పరిస్థితి వచ్చింది. డ్యూటీలో ఉన్న అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ కు ఎన్నిసార్లు అధికారుల ఫోన్ చేసినా స్పందిం చలేదు సదరు వ్యక్తి. దీంతో అక్కడ ఏం జరిగిందో అని అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఉరుకుల పరుగుల మీద ఆ స్టేషన్ మాస్టర్ దగ్గరికి వచ్చారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత జరిగిన ఘటన చూసి మాత్రం ఒక్కసారిగా షాకయ్యారు అధికారులు. డ్యూటీలో ఉన్న అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి అప్పటికే ఫుల్లుగా మద్యం తాగి చివరికి ఒళ్లు తెలియకుండా నిద్ర పోయాడు

 ఇక అతడు నిద్రపోవడం కారణంగా ఏకంగా ప్రమాదం జరిగి ఉండేది అని అటు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీకి చెందిన అనిరుద్ కుమార్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవలే విధులకు హాజరైన అతను డ్యూటీలో మద్యం సేవించాడు. ఈ క్రమం లో మద్యం మత్తులో అతను డ్యూటీలో ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి నిద్రలోకి జారుకున్నాడు. ఇక అప్పటికే స్టేషన్కు ఫారక్క, మగదా  ఎక్స్ ప్రెస్ లు వచ్చిన నిలబడ్డాయి. సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాయి. సిగ్నల్ వస్తే బయలుదేరేందుకు ఆ రెండు ఎక్స్ప్రెస్ ట్రైన్ లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక వాటి వెనకాలే గూడ్స్ రైలు కూడా వచ్చి ఆగి ఉన్నాయి. అయితే ఎంత సేపటికీ ఇక సిగ్నల్ రాకపోవడంతో నార్త్ సెంట్రల్ రైల్వే అధికారులు డ్యూటీలో ఉన్న అనిరుద్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ఫోన్ చేశారు. అతను ఫోన్ తీయక పోవడంతో అధికారులు హుటాహుటిన అక్కడికి వచ్చారు. ఈ క్రమంలోనే అనిరుద్ కుమార్ డ్యూటీ చేయకుండా మద్యం మత్తులో నిద్రపోతున్నాడు. దీంతో ఇక అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: