పొలంలో బయటపడ్డ లంకె బిందె.. తెరిచి చూస్తే షాక్?
పాపం వాళ్ళ కష్టం చూసి లక్ష్మీదేవి ఏకంగా వరం ఇచ్చినట్లుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఆ పొలంలో సాగు చేస్తున్నా వరించని అదృష్టం ఇటీవలే పొలానికి చదును చేస్తుండగా వరించింది. పొలంలో బంగారం పండింది అని అంటూ ఉంటారు కదా ఇక అదే తరహాలోనే పొలంలో లంకెబిందెలు బయటపడ్డాయి. ఇక లంక బిందెలు తెరిచి చూడగా వేల సంఖ్యలో బంగారు నాణేలు అందరినీ అవాక్కయ్యేలా చేశాయ్. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లా లో లభ్యమైన లంకె బిందె ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. వివరాల్లోకి వెళితే... చివ్వేంల మండలం తుల్జా రావు పేట గ్రామంలో ఇటీవలే లంక బిందె బయట పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రాక్టర్ తో భూమి చదును చేస్తుండగా లంకె బిందె లభ్యమైంది.
ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ఇక లంకె బిందెలో పూర్తిగా బంగారం ఉండడంతో దొరికిన బంగారాన్ని ఇద్దరు పంచుకోవాలి అనుకున్నారు. కానీ ఈ పంపకాల్లో ముగ్గురి మధ్య వివాదం తలెత్తింది. పోలీసుల వరకూ వెళ్లింది ఆ తర్వాత హోంగార్డు ఇక ఇద్దరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకుని తనకు కూడా కొంత మొత్తం వచ్చేలాగా డీల్ కుదిరిచాడట. అయితే ఇటీవల దీనికి సంబంధించిన అంశం బయటకు రావడంతో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ లంకె బిందె ను అటు అధికారులు స్వాధీనం చేసుకుంటారా లేదా లైట్ తీసుకుంటారన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.