నిరుద్యోగులకు శుభవార్త : 50వేల ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు?
ఈ సందర్బంగా గతం లో ఇచ్చిన ఖాళీ వివరాల పై సమీక్ష కూడా నిర్వహించింది ఆర్థిక శాఖ. అంతేకాదు శాఖల వారీగా ఖాళీల ఫైనల్ జాబితా తీసుకుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఆయా శాఖలు ఇచ్చిన ఖాళీల వివరాలను క్రోడీకరించి కేబినెట్ ముందు పెట్టనుంది ఆర్థిక శాఖ.
ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ అనేది కేబినెట్ మీటింగ్ తర్వాత క్లారిటీ వస్తుంది అంటున్నారు ఉన్నతాధికారులు. ఈ లెక్కన జులై నెల చివరన 50 వేల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కాగా ఈ నెల 29న 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవల అడ్డంకులు తొలగిన నేపథ్యంలో... ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్ని శాఖల లో కలిపి దాదాపు 50 వేల ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇక ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగాల ఖాళీలను గుర్తించి రెండోదశలో భర్తీ చేయాలన్నారు సిఎం కెసిఆర్.