ప్రపంచంలోనే ఖరీదైన బర్గర్.. ధర ఎంతో తెలుసా?
ఈ క్రమంలోనే కొత్త టేస్ట్ తో ఉండే బర్గర్ తినడానికి అటు ఎంతో మంది జనాలు కూడా ఆసక్తి చూపుతుంటారు అయితే ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్నో రకాల బర్గర్స్ వివిధ ఆహార లకు సంబంధించిన వివరాలు కూడా అందరూ తెలుసుకోగలుగుతున్నారు. అయితే ఇటీవలే ఒక బర్గర్ కు సంబంధించిన విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగా అయితే ఒక బర్గర్ ధర ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ బర్గర్ ధర తెలిస్తే మాత్రం అందరూ ముక్కున వేలేసుకుంటారు. ఇటీవలే నెదర్లాండ్ కి చెందిన ఒక చెఫ్ ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్ను తయారు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
ప్రస్తుతం ఇక ప్రపంచంలోనే ఖరీదైన బర్గర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. నెదర్లాండ్ కి చెందిన రాబర్ట్ జార్జ్ ఎప్పుడు వినూత్నరీతిలో సరికొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇటీవల ప్రపంచంలోనే ఎంతో కాస్లీ బర్గర్ తయారు చేశాడు. ఈ బర్గర్ తయారు చేయడానికి అన్ని కాస్ట్లీ ఐటమ్స్ ఉపయోగించాడు ఇక ఈ బర్గర్ పేరు ది గోల్డెన్ బాయ్. ఈ బర్గర్ తయారీ పూర్తయిన తర్వాత దీనిని ఒక సీసాలో పెట్టి విస్కీ ప్రేరేపిత పొగను పట్టిస్తూ ఉంటారు. అంతేకాదు బంగారు ఆకులో చుట్టి ఈ బర్గర్ను సర్వ్ చేస్తూ ఉంటారట. ఇక ఈ బర్గర్ తినాలి అనుకుంటే మాత్రం 6000 డాలర్లు ఖర్చు చేయాల్సిందే. అంతేకాదండోయ్ ఈ బర్గర్ తినాలనుకుంటే రెండు వారాల ముందే బుక్ చేసుకోవడమే కాదు 15% డౌన్ పేమెంట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది.