అక్కడ ఏమీ లేదు.. కేసిఆరే రాద్ధాంతం చేస్తున్నారు: సజ్జల

praveen
గత కొంతకాలం నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఎంతలా ముదురుతుందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణకు రావాల్సిన నీటీని ఏపీ తన్నుకు పోతుంటే చూస్తూ ఊరుకోబోమని అంటూ అటు తెలంగాణ అధికార పార్టీ నేతలతో పాటు తెలంగాణ ప్రతిపక్ష పార్టీలన్నీ ఆంధ్ర పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.  ఏపీ నేతలు కూడా తెలంగాణ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదం కాస్త రోజురోజుకూ ముదురుతోంది.  అయితే కృష్ణా జలాల విషయంలో ఒక అప్పుడే తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిందని.  ఒప్పందం ప్రకారమే తాము తమ హక్కు మేరకే జలాలను వాడుకుంటున్నాము అంటూ ఏపీ ప్రభుత్వం చెబుతోంది.



 అప్పుడు ఒప్పందం మీద సంతకం చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇక ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాద్ధాంతం చేయడం సరికాదంటూ ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారిపోయింది. పక్క రాష్ట్రాలతో సామరస్యంగా ఉండాలని తమ ప్రభుత్వం భావిస్తోంది అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో అటు తెలంగాణ నేతలు మాత్రం ఇక ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా వైసీపీ కీలక నేత ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 కృష్ణా జలాలపై ఏపీ తెలంగాణల మధ్య వాస్తవానికి ఎలాంటి వివాదం లేదు అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి కూడా తెలుసు అంటూ చెప్పుకొచ్చారు.  కానీ కేవలం రాజకీయ కోణంలోనే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలపై వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తుంది అంటూ విమర్శించారు  సజ్జల రామకృష్ణారెడ్డి. తెలంగాణలోనే అక్రమంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను నిర్మించారు అంటూ విమర్శలు చేశారు. రాయలసీమకు నీళ్లు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తమ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి సహకారం అందిస్తుంది అంటూ గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారు అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పుడు అలా హామీ ఇచ్చి ఇప్పుడు మాత్రం రాయలసీమకు నీళ్లు అందిస్తూ ఉంటే చూసి ఓర్వలేక అడ్డుపడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు సజ్జల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: