షాకింగ్ : ఆనందంలో ఆత్మహత్య చేసుకున్నాడు?
ఇలా ఇటీవలి కాలంలో చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణంగా ఎవరైనా దేవుడికి ఎలాంటి మొక్కలు మొక్కుకుంటారు తాము కోరుకున్నది జరిగితే తలనీలాలు అర్పిస్తాం అని అనుకుంటారు లేదా ఘనంగా పూజలు నిర్వహిస్తాం అని మొక్కుకుని ఇక కోరుకున్నది జరిగిన తర్వాత మొక్కులు చెల్లిస్తుంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా కోరుకున్నది జరిగితే ప్రాణాలు అర్పిస్తా అంటూ మొక్కుకున్నాడు. ఇక చివరికి కోరుకున్నది జరిగిందని ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇంతకీ అతను కోరుకున్నది ఏమిటి అని అంటారా.. తన అభిమాన పార్టీ అధికారంలోకి రావాలి అని కోరుకున్నాడు.
ఇక పార్టీ అధికారంలోకి రావడంతో సంతోషంలో ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ గెలిచింది.ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ కార్యకర్త ఆనందంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కరూర్ జిల్లాల లాల పేటకు చెందిన ఉలగనాథ్ అనే 60 ఏళ్ల వ్యక్తి డీఎంకే పార్టీ గెలవాలి అని కోరుకున్నాడు. ఇక పార్టీ గెలిచి అధికారంలోకి రావడంతో ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు అయితే అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు సదరు వ్యక్తి. అయితే పార్టీ గెలవాలని ఆ దేవున్ని మొక్కుకున్నానని అందుకే ఇక పార్టీ గెలవడంతో తాను ఆత్మహత్య చేసుకుని మొక్కు తీసుకుంటున్నాను అంటు సూసైడ్ నోట్లో రాశాడు.