ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. 13 సెకన్లలో ప్రపంచ రికార్డు?
ఆ చిన్నోడికి ఐదేళ్లే వయసు.. అలా అని అతనిని తక్కువ అంచనా వేశారు అంటే ఇక పంచ్ ల వర్షంతో అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాడు. అతనికి చిన్నప్పుడు నుంచి బాక్సింగ్ అంటే పిచ్చి.. అందరూ టీవీ లో కార్టూన్స్ చూస్తూ ఉంటే ఈ బుడతడు మాత్రం బాక్సింగ్ మ్యాచ్ లు చూస్తూ పెరిగాడు. దీంతో అందరి పిల్లలు అల్లరి చేయడం చేస్తూ ఉంటే ఇక ఈ బుడతడిలో మాత్రం బాక్సింగ్ అనేది నరనరాల్లో పాకి పోయినట్లు తెలుస్తోంది. దీంతో ఇక 5 ఏళ్ళ వయస్సుకే అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు ఇక్కడ ఒక బుడ్డోడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఢిల్లీకి చెందిన ఐదేళ్ల చిన్నోడు ఈ రికార్డును సాధించాడు. ఢిల్లీకి చెందిన అరవిందం గౌర్ అనే చిన్నారి ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం 13 సెకన్లలోనే గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డులకెక్కాడు. ఇక ఈ రికార్డు పై స్పందించిన ఐదేళ్ల చిన్నారి తన మాటలతో కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. నాకు బాక్సింగ్ అంటే ఎంతో ఇష్టమని ప్రతిరోజు ఉదయం సాయంత్రం 3గంటల పాటు ప్రాక్టీస్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. భారత్ తరఫున మంచి బాక్సర్ గా మారి ప్రపంచ రికార్డులు కొట్టడమే తన లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు. విజయేందర్, మేరీకోమ్ లాంటి వాళ్లే తన స్ఫూర్తి అంటూ ఐదేళ్ల చిన్నారి చెప్పిన మాటలతో అందరూ అవాక్కవుతున్నారు.