దారుణం : రోడ్డుపైనే మహిళ చీర లాగారూ?
ఉత్తరప్రదేశ్లో మరికొన్ని రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది ఇక ఆసక్తి గల అభ్యర్థులు అందరూ ఎంతో మంది తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇక ఇలా అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసే క్రమంలో కొన్ని ప్రాంతాలలో ఇటీవలే ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇక ఇటీవలే ఏకంగా నడిరోడ్డు పైన ఓ మహిళ చీర లాగిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఈ వీడియోలో ఓ మహిళ నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఏకంగా పక్కనే ఉన్న ఇద్దరు పురుషులు వచ్చి ఆమె చీర లాగారు.
ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే చీర పట్టుకుని గుంజారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్కీం పూర్ లో ఘటన చోటుచేసుకుంది అయితే సదరు బాధిత మహిళ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పార్టీ మద్దతుదారులు అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోటీ చేయాలనుకున్న ఆమె నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లగా అక్కడ ఇలా ప్రత్యర్థి పార్టీకి చెందిన వారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు అనే విషయం ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఇక దీనికి సంబంధించిన వీడియోను సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాదు ఇక రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులకు కారణమైన సీఎం యోగి ఆదిత్యనాథ్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అఖిలేష్ యాదవ్.