జగన్‌కు ఆ విషయమే ప్లస్ అవుతుందటా!

M N Amaleswara rao

దక్షిణాది రాష్ట్రాల్లో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్నది ఎవరంటే ఠక్కున ఏపీ సీఎం జగన్ పేరు చెప్పేయొచ్చు. దక్షిణాదిలో జగన్‌కు ఉన్న బలం ఏ రాష్ట్రంలోనూ మరో అధికార పార్టీ సీఎంకి లేదని చెప్పొచ్చు. ఏపీలో జగన్‌కు తిరుగులేని బలం ఉంది. అంత బలంగా ఉన్న సీఎం జగన్‌ని దెబ్బకొట్టడానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. నిత్యం జగన్‌పై ఏదొరకంగా విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ఏదొక అంశంపై పోరాటాలని, దీక్షలని చేస్తున్నారు.


అయితే ఇంత చేస్తున్నా కూడా జగన్‌కు ఏమన్నా ఇబ్బంది అవుతుందా అంటే అదేమీ లేదని చెప్పొచ్చు. గడిచిన రెండేళ్లలో జగన్ బలం ఏ మాత్రం తగ్గలేదు. ఇలా జగన్ బలం తగ్గకపోవడానికి ప్రధాన కారణం సంక్షేమ పథకాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన చెప్పిన విధంగానే, చెప్పిన సమయానికి ప్రజలకు పథకాలు అందిస్తున్నారు. రాష్ట్రంలో పేద, మధ్యతరగతికి చెందిన కుటుంబాలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నాయి.


ఈ పథకాల ద్వారా నేరుగా ప్రజల ఎకౌంట్‌ల్లోకి డబ్బులు వేస్తున్నారు. దీంతో జగనే డబ్బులు వేశారని ప్రజలు భావిస్తున్నారు. అయితే అప్పులు చేసి మరీ పథకాలకు డబ్బులు ఇస్తున్నారని, ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెడుతున్నారని, అటు ప్రజలపై పన్నులు భారం పెంచేశారని, ఒక చేత్తో డబ్బులు ఇచ్చి, మరో చేత్తో డబ్బులు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.


కానీ ఈ ఆరోపణలని పేద, మధ్య తరగతి కుటుంబాలు పెద్దగా పట్టించుకోవడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ పథకాల ద్వారా అందించే డబ్బులు ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయని, కష్టకాలంలో అండగా ఉంటున్నాయని, అందుకే ఆ ప్రజలు ఇంకా జగన్ వైపే ఉన్నారని, అదే జగన్‌కు ప్లస్ అవుతుందని చెబుతున్నారు. కరెక్ట్ సమయంలో ఎకౌంట్‌ల్లో డబ్బులు పడటం వల్ల లబ్దిదారులకు బాగా బెనిఫిట్ జరుగుతుంది. దాని వల్లే ప్రజలు జగన్ విషయంలో ఇంకా పాజిటివ్‌గా ఉన్నారని అంటున్నారు. ఏదేమైనా సంక్షేమ పథకాలు జగన్‌కు బాగా ప్లస్ అవుతున్నాయని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: