ఓటమి ఎరుగని నేత వైఎస్ఆర్..!
1985వ సంవత్సరం నుండి 1998 వరకు కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్. నిత్య అసమ్మతివాదిగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ సీఎంలందరితోనూ పోరాడేవారు. మర్రి చెన్నారెడ్డి, జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి లాంటి లీడర్లతో పోరు సాగించారు. వారికి వ్యతిరేకిస్తూ ప్రత్యేకంగా క్యాంపులు నడిపారు. వైఎస్ 1983వ సంవత్సరంలో మొట్టమొదటి సారి పీసీసీ చీఫ్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1998లో కూడా పీసీసీ పగ్గాలు అందుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 1999 నుంచి 2004 వరకు ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా రాణించారు. 1989-94 మధ్య సీఎం పదవి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవకాశం దక్కలేదు. 1999వ సంవత్సరంలో మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికై... ప్రతిపక్షనేతగా ఉంటూ తర్వాతి ఎలక్షన్ లలో కాంగ్రెస్ పార్టీ విజయానికి పక్కా ప్లాన్ వేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఓటమి ఎరుగని నేతగా పేరుంది. ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు.. వీరిద్దరూ మంచి స్నేహితులు.
1985వ సంవత్సరం నుండి 1998 వరకు కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్. నిత్య అసమ్మతివాదిగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ సీఎంలందరితోనూ పోరాడేవారు. మర్రి చెన్నారెడ్డి, జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి లాంటి లీడర్లతో పోరు సాగించారు. వారికి వ్యతిరేకిస్తూ ప్రత్యేకంగా క్యాంపులు నడిపారు. రాజకీయాల్లో ముక్కుసూటితనం, నిర్మొహమాటానికి మారుపేరు వైఎస్ ఆర్.