పాస్టర్ ముసుగులో పాడుపని.. బాలిక చేతిలో రూ.50 పెట్టి?
భక్తులకు ఆధ్యాత్మిక విషయాలు బోధించాల్సిన పాస్టర్ కామం తో ఊగిపోయాడు. ఏకంగా దేవుడు చెంతకు వచ్చిన బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఇక్కడొక పాస్టర్. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... కాకినాడ గ్రామీణ మండలానికి చెందిన గంగాధర్ అలియాస్ సుధాకర్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఓ చర్చిలో పాస్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే పాస్టర్ గా ఇక ఎంతో బాధ్యతగా వ్యవహరించి మంచి మాటలు చెప్పాల్సింది పోయి కీచకుడిగా మారిపోయాడు. ఈ క్రమంలోనే ఆ చర్చికి వచ్చే బాలిక పై కన్నేశాడు.
గత నెల 28వ తేదీన ఆ చర్చికి వచ్చిన 10 ఏళ్ళ బాలికకు మాయమాటలు చెప్పి చర్చికి దూరంలో ఉన్న పశువులపాకలో కి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే బాలికతో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడికి ప్రయత్నించారు. అయితే బాలిక పాస్టర్ తీరుతో ఒక్కసారిగా భయపడిపోయింది. దీంతో పెద్దగా కేకలు వేసింది. ఇక అంతలో జేబులో ఉన్న 50 రూపాయలు చేతిలో పెట్టి ఎవరికీ చెప్పొద్దూ అంటూ హెచ్చరించి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు ఇక గ్రామస్తులకు ఈ విషయం తెలిసి బాలిక తల్లిదండ్రులను అసలు విషయాన్ని బయటకు చెప్పేశారు. ఈ క్రమంలోనే గ్రామస్తులు సాయంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అరెస్టు చేసి విచారిస్తున్నారు.