మమత వ్యూహం సక్సెస్.. పార్టీలోకి మాజీ రాష్ట్రపతి కుమారుడు?

praveen
పశ్చిమ బెంగాల్లో రెండోసారి అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి మమత బెనర్జీ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఇతర పార్టీల నేతలందరినీ తమ పార్టీలో చేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే బీజేపీకి చెందిన కొంతమందిని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇక ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్నా కాంగ్రెస్ కీలక నేత ఇటీవలే తృణముల్   కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కోల్కతా లోని పార్టీ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొడుకు కాంగ్రెస్ పార్టీ కీలక నేత అభిజిత్ ముఖర్జీ తృణమూల్  కాంగ్రెస్ పార్టీలో చేరారు.


 అయితే ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన అభిజిత్ ముఖర్జీ ఇక తండ్రి మరణం తర్వాత తృణమూల్  కాంగ్రెస్ పార్టీలో చేరటం ప్రస్తుతం హాట్ టాపిక్ మారిపోయింది   అంతేకాకుండా ఇది అటు బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ అని చెప్పాలి. అయితే 2011లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఎన్నికయ్యారు అభిజిత్ ముఖర్జీ.  ఆ సమయంలో తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కూడా ఓ సారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు అభిజిత్ ముఖర్జీ.

 2019 లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే గత కొంత కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు అభిజిత్ ముఖర్జీ. అదే సమయం అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ కి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూ ఉండటం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ బాధ్యతలు చూశారు అభిజిత్ ముఖర్జీ.   ఇక కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో జతకట్టడం పై విభేదించారు. ఇక ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో బిజెపి మత ప్రచారాన్ని మమత కంట్రోల్ చేశారని ప్రశంసించారు. కాంగ్రెస్ లో తనకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని అందుకే టీఎంసీలో చేరినట్లు అభిజిత్ ముఖర్జీ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Tmc

సంబంధిత వార్తలు: