మరికొన్ని రోజుల్లో బక్రీద్.. డిజిపి కీలక ఆదేశాలు?
ఇక అన్ని జిల్లాల కమిషనర్లు జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు డీజీపీ మహేందర్ రెడ్డి. మరికొన్ని రోజుల్లో బక్రీద్ పండుగ రాబోతున్న నేపథ్యంలో గోవధ కు సంబంధించి ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండి అనుమానిత ప్రాంతాల్లో ఎక్కువగా నిఘా ఏర్పాటు చేయాలి అంటూ జిల్లా కమిషనర్లకు ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు మహేందర్రెడ్డి. బక్రీద్ పండుగ నేపథ్యంలో ఇక రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు డీజీపీ మహేందర్ రెడ్డి.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి అంటూ సూచించారు. ఇక రాష్ట్రంలో ఎక్కడ గోవుల అమ్మకాలు జరగకుండా చూడాలని పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేయాలని వీడియో కాన్ఫరెన్స్ లో కమిషనర్లు ఎస్పీలకు ఆదేశాలు జారీచేశారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఎక్కడైనా ఇక గోవుల అక్రమ రవాణా చేపడితే ఇక నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ చెప్పుకొచ్చారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సహించేది లేదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు డీజీపీ మహేందర్ రెడ్డి.