మంత్రి హరీష్ రావు: రైతు ఋణాలలో కోత విధించొద్దు..!

MOHAN BABU
రైతులందరికీ సరైన సమయంలో రుణాలు అందించాలని, పింఛన్లు, రైతుబంధు క్రాప్ లోన్లలో కోతలు విధించరాదని బ్యాంకు అధికారులకు  ఆర్థిక మంత్రి హరీష్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, వైస్ చాన్సలర్ నీరజ  బ్యాంకు అధికారులతో కలిసి యూనియన్ బ్యాంక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ గత 17 నెలలుగా కరోణతో దేశ, రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, మధ్యతరగతి  ప్రజలకు రుణాలు అందిస్తూ బ్యాంక్ ఆదుకోవాలని కోరారు.

 ఆసరా పెన్షన్ లు, రైతుబంధు లాంటి వాటిలో లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. త్వరలోనే ఫారెస్ట్ కళాశాలను యూనివర్సిటీగా మార్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడని, ఫారెస్ట్ కాలేజీ విద్యార్థుల సౌలభ్యం కొరకు ఉపయోగపడేలా బ్యాంకు సేవలు అందించాలని, యూనివర్సిటీ దగ్గరలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు పక్కన ఎటిఎం ఏర్పాటుకు యూనివర్సిటీ వారంతా బ్యాంకుకు సహకరించాలని కోరారు. ఇది ప్రజల ప్రభుత్వ మనీ అన్నారు.  

కార్పొరేషన్ బ్యాంకు లు, ఆంధ్ర బ్యాంకులు యూనియన్ బ్యాంకులో విలీనం అయిన తర్వాత మొట్టమొదటి బ్రాంచ్ ను సిద్దిపేట జిల్లాలోని  ప్రారంభిస్తున్న అందుకు  బ్యాంక్ అధికారులకు హరీష్ రావ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు  లక్ష యాభై వేల  బిజినెస్ చేపట్టినట్టు, భారతదేశంలోనే  ఐదవ స్థానంతో  , తెలంగాణలో రెండో స్థానంలో ఈ బ్యాంకు సేవలు అందిస్తున్నారని మంత్రి హరీష్ రావుకు  బ్యాంక్ వర్గాలు  తెలిపారు. అనంతరం ఉద్యాన యూనివర్సిటీలో మంత్రి హరీష్ రావు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు కూడా నాటాలని, మొక్కలు రక్షిస్తే  అవి మనల్ని రక్షిస్తాయని అన్నారు. ప్రభుత్వం హరిత హారానికి ఎంతో ఖర్చు చేస్తోందని కాబట్టి మన మొక్కలు నాటి సంరక్షించి హరిత తెలంగాణగా మార్చాలని కోరారు. ఇంటికి ఐదు మొక్కలు తీసుకుని వాటిని నాటి    సంరక్షించాలని  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: