టీటీడీ నిర్ణయం.. అందరూ ఆగ్రహం?
భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటుంది టిటిడి బోర్డు. భక్తులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది. అయితే ఇటీవలే టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయం పై మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే టీటీడీ ఆలయంలో వేలాది సంఖ్యలో సిబ్బంది పని చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు ప్రైవేట్ సంస్థల ద్వారా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించు కోవడం చర్చనీయాంశంగా మారిపోయింది.
భక్తులకు సేవలు అందించే కేంద్రాలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది అని ఇటీవలే ప్రకటించారు. లడ్డు పంపిణీ, కల్యాణకట్ట కేంద్రాల నిర్వహణ, వైకుంఠం టికెట్లు తనిఖీ కేంద్రం, సర్వ దర్శనం టైమ్ స్లాట్ లాంటి సేవలు అన్నింటిని కూడా ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో బ్యాంకుల ద్వారా లడ్డు విక్రయాలు జరిగాయని.. నాణ్యమైన సేవలు అందించేందుకు ఏజెన్సీకు అప్పగిస్తున్నామని టిటిడి బోర్డు తెలిపింది. అయితే దీనిపై విశ్లేషకులు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మెరుగైన నాణ్యమైన సర్వీసుల కోసం ప్రైవేట్ ఏజెన్సీలు ఇస్తున్నాము అని చెబుతున్న టిటీడీ బోర్డు ఇన్ని రోజుల వరకు నాణ్యమైన సేవలు అందించలేదు అన్న విషయం ఒప్పుకున్నట్లే అంటూ ప్రశ్నిస్తున్నారు. అన్ని సేవలు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తే.. మరి తిరుమల తిరుపతి దేవస్థానం లో పనిచేసే సిబ్బంది ఏం చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు.