గుడ్ న్యూస్ : మరో కరోనా టీకా వచ్చేస్తోంది?

praveen
ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా  కొనసాగుతోంది.  18 సంవత్సరాలు నిండిన వారు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తాము అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ క్రమక్రమంగా రూపాంతరం చెందుతూ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఇక వైరస్ పై పోరాటంలో వ్యాక్సిన్ ఎంతో కీలకంగా మారిపోయింది. ఈ క్రమంలోనే అందరికీ వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.  ఇక కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా అటు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్నాయి.



 అయితే ప్రస్తుతం భారత్లో సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారుచేసిన కోవిషీల్డ్ భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాక్సిన్  టీకా లు అత్యవసర వినియోగంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు టీకాలను దేశవ్యాప్తంగా వేగంగా పంపిణీ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇటీవలే  భారత ప్రభుత్వం రష్యాకు చెందిన స్పుత్నిక్ వి అనే వ్యాక్సిన్ ను కూడా భారత్లో అత్యవసర వినియోగం కోసం అనుమతించింది. అయితే ప్రస్తుతం మూడవదశ కరోనా వైరస్ ముప్పు ముంచుకొస్తున్న సమయంలో డిసెంబర్ నాటికల్లా భారతీయులందరికీ వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ ప్రక్రియ మరింత వేగంగా జరిగేందుకు మరో వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది.



 అమెరికాకు చెందిన మోడోర్నా కరోనా వ్యాక్సిన్ కు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోందట. అయితే ఈ వ్యాక్సిన్ దిగుమతి అమ్మకాల కోసం మల్టీనేషనల్ ఫార్మా కంపెనీ అయినా సిప్లా డ్రగ్స్ కి డిసిజిఐ అనుమతి మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది  ఇక ఈ రోజే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం   ఇప్పటికే దీనికి సంబంధించి డిసిజీఐ కి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 90% సామర్ధ్యము కలిగిన మోడోర్నా టీకా కెనడా అమెరికా బ్రిటన్ వంటి దేశాలలో అత్యవసర వినియోగం కోసం అనుమతించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇక మరికొన్ని రోజుల్లో ఇక ఈ వ్యాక్సిన్ భారత్లో కూడా అత్యవసర వినియోగంలోకి వచ్చే అవకాశం ఉందనీ.. తద్వారా వాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: