తగ్గేదేలే అంటున్న మమతా బెనర్జీ.. గవర్నర్ ని కూడా వదల్లేదు?
ఇప్పటికే కోల్కత్తా నగరాన్ని మొత్తం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులో కి మార్చాలి అంటూ ఆదేశాలు కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అదే సమయంలో ఇక ఎన్నికల ముందు తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ లోకి వెళ్ళిన వారిని మళ్లీ పార్టీలోకి చేర్చుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపికి ఎక్కువ మెజారిటీ వచ్చిన ప్రాంతాలలో ఏకంగా బిజెపి నేతలందరికీ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ నేతలు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ పై ప్రతీకారం తీర్చుకోవడానికి సంచలనం నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఇటీవలే ఈ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గవర్నర్ ని కూడా వదల్లేదు.
కొన్ని రోజుల నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. గవర్నర్ జగదీష్ ధన్కర్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీష్ ధన్కర్ అవినీతిపరుడని 1996లో హవాలా కేసులో ఆయనపై చార్జిషీటు కూడా దాఖలు అయింది అంటూ విమర్శలు చేశారు మమతా బెనర్జీ. ఇక మమతా విమర్శల పై స్పందించిన గవర్నర్ నా పేరు ఏ ఛార్జిషీటులో లేదని.. ఏ కోర్టు నుంచి కూడా స్టే తీసుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి మమత నుంచి ఇలాంటి విమర్శలు ఊహించలేదు అంటూ వ్యాఖ్యానించారు గవర్నర్. ఇలా ముఖ్యమంత్రి గవర్నర్ మధ్య మాటల యుద్ధం హాట్ టాపిక్ గా మారిపోయింది.