టీడీపీలో ‘కమ్మ’ బ్యాచ్ పుంజుకోలేదా?
టీడీపీ అంటే కమ్మ సామాజికవర్గం....కమ్మ వర్గం అంటే టీడీపీ అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే టీడీపీ స్థాపించిందే కమ్మ వర్గానికి చెందిన ఎన్టీఆర్...ఇక ఆయన తర్వాత టీడీపీని నడిపిస్తున్నది అదే వర్గానికి చెందిన చంద్రబాబు. అందుకే టీడీపీలో కమ్మ నేతలు ఎక్కువగా ఉంటారు. అలాగే కమ్మ ఓట్లు టీడీపీకే ఎక్కువ పడతాయి.
కాకపోతే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కమ్మ నేతల హడావిడి ఎక్కువగా ఉంటుంది. అసలు వేరే వర్గాలకు పెద్ద ఛాన్స్ ఇవ్వరు. కానీ టీడీపీ అధికారంలో లేకపోతే కమ్మ నేతలు సైడ్ అయిపోతారు. కానీ మిగతా వర్గాలు పార్టీ కోసం కష్టపడతాయి. ఇప్పుడు ఏపీలో టీడీపీకి అధికారం లేదు. అందుకే టీడీపీలో చాలామంది కమ్మ నేతలు సైలెంట్‌గా ఉంటున్నారు.
టీడీపీలో ఉన్న కమ్మ ఎమ్మెల్యేలు..అంటే చంద్రబాబు, బాలకృష్ణలని పక్కనబెడితే.. పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, గద్దె రామ్మోహన్, బుచ్చయ్య చౌదరీ, వేగుళ్ళ జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబులు పార్టీలో మరీ దూకుడుగా ఉండటం లేదు. ఏదో కొందరు మీడియాలో మాట్లాడటం వరకే పరిమితమవుతున్నారు.
అలాగే పలు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా ఉన్న కమ్మ నేతలు సైతం దూకుడుగా పనిచేయడం లేదు. ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ళ నరేంద్ర, జివి ఆంజనేయులు, కోడెల శివరాం, కొమ్మాలపాటి శ్రీధర్, యరపతినేని శ్రీనివాసరావు, రాయపాటి సాంబశివరావు, ఆలపాటి రాజా, బోడే ప్రసాద్ లాంటి నాయకులు ఇంకా తమ నియోజకవర్గాల్లో పుంజుకోలేదు.
దేవినేని ఉమా, చింతమనేని ప్రభాకర్, అరిమిల్లి రాధాకృష్ణ, గన్నీ వీరాంజనేయులు లాంటి వారు పర్వాలేదనిపిస్తున్నారు. అటు అనంతపురంలో పరిటాల ఫ్యామిలీ కూడా ఇంకా పికప్ అవ్వలేదు. నారా లోకేష్ సైతం రాష్ట్ర రాజకీయాల్లో దూకుడుగా ఉంటున్నారుగానీ, మంగళగిరిలో మాత్రం ఇంకా పట్టు తెచ్చుకోలేదు. ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌లు కూడా కాస్త వీక్ అయినట్లే కనిపిస్తున్నారు. ఇటీవల పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఈ కమ్మ బ్యాచ్ నాయకులు పార్టీని గెలిపించుకోలేకపోయారు. మరి ఈ కమ్మ బ్యాచ్ టీడీపీలో ఎప్పుడు పుంజుకుంటుందో చూడాలి.