సీఎంలకు ఎంకే స్టాలిన్ లేఖ.. మోదీకి షాక్ ఇస్తారా?

praveen
దేశ రాజకీయాల్లో రోజురోజుకు పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అన్ని ప్రతిపక్ష పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. ముఖ్యంగా థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ అంటూ ఎన్నో ప్రచారాలు తెరమీదికి వస్తున్నాయి. ఇప్పటికే బిజెపికి వ్యతిరేకంగా ఎన్డీఏ యేతర పార్టీలన్నీ ఒకటి అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇక జరుగుతున్న పరిణామాలు ఎంతో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఇక ఇటీవలే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.



 అమలులో ఉన్న ఇండియన్ పోర్ట్స్ యాక్ట్ 1908 ప్రకారం  మైనర్ పోర్టుల ప్రణాళిక, అభివృద్ధి, క్రమబద్ధీకరణ, నియంత్రణ వంటి అధికారాలు రాష్ట్ర ఉంటాయని లేఖ లో పేర్కొన్నారు ఎంకే స్టాలిన్  ఇక నుంచి ఈ అధికారాలన్నీ ఎంఎస్డిసి కి బదిలీ చేయాలని కొత్త బిల్లును ప్రతిపాదించడం సరైనది కాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందన్నారు. ఇక ఈ బిల్లుకు అందరూ వ్యతిరేకత వ్యక్తం చేయాలి అని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్,గోవా, మహారాష్ట్ర,కర్ణాటక, కేరళ,ఒడిశా పశ్చిమ బెంగాల్, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రులకు లేఖ రాశారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.




 ఒకవేళ ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన బిల్లు గనుక పార్లమెంటులో ఆమోదం పొందింది అంటే ఓడరేవుల విషయంలో రాష్ట్రాల అధికారం ఏమీ ఉండదు అంటూ లేఖలో పేర్కొన్నారు. ఇలా రాష్ట్రాల అధికారాలను బలవంతంగా లాక్కునే బిల్లును అందరం కలిసికట్టుగా అడ్డుకుందాం అంటూ లేఖలో పిలుపునిచ్చారు. ఈనెల 24వ తేదీన జరగబోయే ఎం ఎస్ డి సి  సమావేశంలో ఇక అందరం కలిసికట్టుగా బిల్లుకు వ్యతిరేకంగా గళం వినిపించాలి అన్నారు స్టాలిన్. ఈ క్రమంలోనే ఎంతమంది ఎంకే స్టాలిన్ పిలుపుకు స్పందించి అందరూ  మద్దతు తెలుపుతారా లేదా  అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: