సచిన్ లాగే రికార్డులు సాధిస్తా అంటున్న కంప్యూటర్ ఆపరేటర్?
అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న లంబోర్గిని లాంటి కార్ ని సైతం ఇటీవల ఓ మెకానిక్ తయారు చేసి అందరికీ షాకిచ్చాడు. అంతే కాదు సోషల్ మీడియాలో సెలబ్రిటీ గా మారిపోయాడు. మరికొంతమంది తమ లో ఉన్న టాలెంట్ బయటపెట్టి ఇక గిన్నిస్ బుక్ రికార్డులను సైతం సొంతం చేసుకుంటూ ఉంటారు. ఈ కోవకి చెందినవాడే మనం మాట్లాడుకునే వ్యక్తి. అతను కంప్యూటర్ ఆపరేటర్.. తరచూ ఉద్యోగానికి వెళ్లడం ఇంటికి రావడం చేసేవారు. ఇలా చేస్తే మనకు ఏం గుర్తింపు ఉంటుంది అనుకున్నాడో ఏమో.. ఏదో ఒకటి చేసి రికార్డులు సృష్టించాలని అనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా వినూత్న ఆలోచన చేసాడు.. ప్రస్తుతం తాను చేస్తున్న పనిని కాస్త వెరైటీగా ట్రై చేస్తే రికార్డులు కొట్టాలి అనుకున్నాడు. ఇక పట్టుదలతో ప్రయత్నించి చివరికి విజయం సాధించాడు. చివరికి 9 గిన్నిస్ బుక్ రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఢిల్లీకి చెందిన వినోద్ కుమార్ జేఎన్యూలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఇప్పటివరకు 9 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు వినోద్ కుమార్. కళ్ళకి గంతలు కట్టుకుని మౌత్ స్టిక్ పెట్టుకొని ఇక అత్యంత వేగంగా టైప్ చేయడం నేర్చుకున్నాడు. ఇక ఇందులో తొమ్మిది గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ లాగా 19 రికార్డులు కొట్టడమే తన టార్గెట్ అంటూ చెప్పుకొచ్చాడు వినోద్ కుమార్.