ఆ ఎంపీలు వల్ల ఉపయోగం లేదా?

M N Amaleswara rao

ఏపీలో అధికార వైసీపీకి 22 మంది లోక్‌సభ సభ్యుల బలం ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు హోదా తెస్తాను 25కి 25 మంది ఎంపీలని ఇవ్వండని జగన్ ప్రచారం చేస్తే ఎన్నికల్లో ప్రజలు 22 మంది ఎంపీలని గెలిపించారు. ఇక టీడీపీ తరుపున ముగ్గురు ఎంపీలు గెలిచారు. అయితే వైసీపీ తరుపున గెలిచిన 22 మంది ఎంపీలు, ఈ రెండేళ్లలో ఏం సాధించారు? అంటే చెప్పడం కష్టమే. రాష్ట్రం కోసం ఏం తీసుకొచ్చారు?అని అడిగిన ఏం సమాధానం రాదు.


ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీలు మెరుగైన పనితీరు కనబర్చడంలో వెనుకబడి ఉన్నారు. విశాఖలో వైసీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. విశాఖపట్నంలో ఎం‌వి‌వి సత్యనారాయణ, అనకాపల్లిలో బీశెట్టి సత్యవతి, అరకులో మాధవిలు వైసీపీ తరుపున ఎంపీలుగా ఉన్నారు. ఇక విజయనగరంలో అశోక్ గజపతిరాజుని ఓడించిన బెల్లాన చంద్రశేఖర్ ఉన్నారు. శ్రీకాకుళంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నారు.


అయితే టీడీపీ ఎంపీగా ఉన్న రామ్మోహన్ లోక్‌సభలో రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగానే గళం విప్పుతున్నారు. ధైర్యంగా కేంద్రాన్ని ప్రశ్నించగలుగుతున్నారు. అనేకసార్లు విశాఖ రైల్వే జోన్ ఇవ్వమని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలాగే వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్రకు సాయం చేయమని పలుసార్లు కేంద్రాన్ని కోరారు. కానీ ఉత్తరాంధ్రలో ఉన్న నలుగురు వైసీపీ ఎంపీలు ఇంతవరకు లోక్‌సభలో పెద్దగా గళం విప్పినట్లు కనిపించలేదు.


అలాగే ఈ నలుగురు రాజకీయంగా కూడా పెద్దగా హైలైట్ అయిన సందర్భాలు కూడా లేవు. పైగా వీరు ఎంపీలనే సంగతి సొంత పార్లమెంట్ ప్రజలకే తెలియకపోవచ్చు. అటు ప్రతిపక్ష టీడీపీకి కౌంటర్లు ఇవ్వడంలో కూడా వెనుకబడి ఉన్నారు. అలాగే వారి సొంత పార్లమెంట్ స్థానాల్లో ఎన్నిసార్లు పర్యటించారో చెప్పలేని పరిస్తితి ఉంది. మొత్తానికైతే ఈ నలుగురు ఎంపీల వల్ల అటు పార్టీకి గానీ, ఇటు ప్రజలకు గానీ పెద్దగా ఉపయోగం ఉన్నట్లు కనిపించడం లేదు.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: