మోడీ, కేసీఆర్.. ఈ వైద్యుల గోడు పట్టించుకోరా..?
డాక్టర్ దేవునితో సమానం అని చెప్పినా అన్నిసార్లు రోగి ప్రాణాలు కాపాడలేకపోవచ్చు. పరిస్థితి విషమించాక రోగిని తీసుకెళ్తే ఎంత గొప్ప డాక్టరయినా చేతులెత్తేయాల్సిందే. అయితే అలాంటి సమయాల్లో రోగి బంధువులు భావోద్వేగంతో ఉంటారు. కొన్నిసార్లు వైద్యుని నిర్లక్ష్యం కారణంగానే తమ బంధువు చనిపోయాడని భావిస్తారు. కొన్నిసార్లు డాక్టర్లపైనా దాడులకు దిగుతారు.
ఇక ఇప్పుడు కొవిడ్ కూడా వైద్యులకు ప్రాణ సంకటంగా మారింది. రోజూ కొవిడ్‌తో సావాసం చేస్తూ మరణం అంచున విధులు నిర్వహిస్తున్నారు వైద్యులు. అయితే కరోనా కాటుకు వైద్యులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 1450 మంది వైద్యులు కోవిడ్ తో మృతి చెందినట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. అసలే కొవిడ్.. ఆపై డాక్టర్లపై దాడులు... ఈ పరిస్థితి మారాలంటూ.. నేడు డాక్టర్లపై దాడుల వ్యతిరేక దినంగా ప్రకటించింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్.
దేశవ్యాప్తంగా శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ప్రకటించింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఈ ఏడాది డాక్టర్లపై దాడులకు సంబంధించి 300 లకు పైగా కేస్ లు నమోదైనట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. ఈ దాడులను ఖండిస్తూ నేడు నల్ల బ్యాడ్జీలు, నల్ల మస్కులను వైద్యులు ధరించి నిరసన తెలుపుతారు. కొవిడ్ నేపథ్యంలో వైద్య సేవలకు ఆటకం కలగకుండా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిరసనలకు వ్యతిరేకంగా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరుతూ వైద్యులు, వైద్య సంఘాల నుంచి ప్రధానికి ఈ మెయిల్ పంపినునట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది.