జియో ముందడుగు.. 5జీ కోసం సిద్ధం?

praveen
భారత టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో సరికొత్త చరిత్ర సృష్టించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇంటర్నెట్ వాడకం అంటే అదొక అదృష్టంగా భావించారు భారతీయులు.  ఇంటర్నెట్ అంటే ఒక గొప్ప విశేషం  అనుకున్నారు.  అదే సమయంలో టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది రిలయన్స్ జియో. తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు అని అందరికీ తెలియజేసింది. ఇక అప్పటి వరకు దిగ్గజ టెలికాం రంగ సంస్థలు గా కొనసాగుతున్న కంపెనీలకు షాక్ ఇచ్చింది. ఇక అతి తక్కువ ధరకే సెల్ఫోన్ తీసుకురావడమే కాదు.. ఇక ఇంటర్నెట్ సదుపాయాలను సైతం ఉచితంగా అందించింది.



 ఇలా టెలికాం రంగంలో ఎంట్రీ వచ్చిన నాటి నుంచి అడుగడుగున సరికొత్త చరిత్రకు నాంది పలుకుతూ వస్తుంది రిలయన్స్ జియో. ఇక ఇప్పుడు  భారత్ ని 5జీ భారత్ గా మార్చేందుకు జియో ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలోనే 5జీ టెక్నాలజీ లో అడుగు పెడతాము అంటూ ప్రకటించింది. ప్రస్తుతం ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే టెలికాం రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించిన రిలయన్స్ జియో.. 5జీ సేవలను ప్రారంభించి మరో చరిత్రకు నాంది పలకాలని సిద్ధమైంది. ప్రపంచ ఫైవ్ జీ టెక్నాలజీలో ప్రస్తుతం యూరప్, చైనా దేశాలు దూసుకుపోతున్నాయి.



 ప్రపంచ దేశాలపై ఈ రెండు దేశాలు 5జీ టెక్నాలజీ విషయంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇటీవలే రిలయన్స్ జియో దేశీయంగానే 5జీ టెక్నాలజీ సేవలు అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది.  ముందుగా ముంబైలో యూసర్ ట్రావెల్స్ కూడా మొదలు పెట్టింది రిలయన్స్ జియో. ఇక ఇది సక్సెస్ అయితే మాత్రం ఇక సరికొత్త చరిత్రకు నాంది పలికినట్లు అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇక జియో చేసిన ఈ ప్రయత్నం మాత్రం అద్భుతం అని అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. జియో చేసిన ఈ గొప్ప ప్రయత్నం సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: