వైసీపీ ప్రభుత్వంపై రఘురామకృష్ణంరాజు ప్రత్యక్షంగా యుద్దానికి దిగినట్లు కనిపిస్తుంది. బెయిల్పై విడుదలైన తరువాత రఘురామ రాజు ఢిల్లీలోని బీజేపీ పెద్దలను కలుస్తూ తనపై జరిగిన దాడిని వివరించారు.ఇదే విషయంపై తన సహచర ఎంపీలందరికి లేఖలు రాశారు.పార్లమెంట్ తనపై జరిగిన దాడి గురించి మాట్లాడాలని తనకు అందరు మద్దతు ఇవ్వాలంటూ లేఖలో పేర్కొన్నారు.అయితే చాలా మంది ఎంపీలు రఘురామకృష్ణం రాజుకు మద్దతు పలికారు.ఇటు అన్ని రాష్ట్రాల గవర్నర్లకు,ఏపీ సీఎంకు తప్ప అన్ని రాష్ట్రాల సీఎంలకు సైతం రఘురామరాజు లేఖలు రాశారు.ఇలా లేఖలు రాసిన తరువాత తన రూట్ ని ఏపీ ప్రభుత్వంపైకి మళ్లించారు. ఏపీ ప్రభుత్వం వైఫల్యాలను ఒక్కొక్కటిగా రఘురామరాజు ఎండగడుతున్నారు.
వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు తన సొంత పార్టీ అధినేతపైనే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. అరెస్ట్ కాక ముందు రాజధాని రచ్చబండ అంటూ ప్రతి రోజు మీడియా ముందుకు వచ్చి సీఎం జగన్ మోహన్ రెడ్డిని, వైసీపీలోని ముఖ్యనేతలను రఘురామరాజు విమర్శించేవారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన తప్పుబడుతూ వచ్చారు.దీనికి తోడు సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో రఘురామకృష్ణం రాజు పిటీషన్ దాఖలు చేశారు.ప్రభుత్వంపై విమర్శలు చేయడమే కాకా సీఎం జగన్ని ఎలాగైనా జైలుకు పంపిచాలనే ఉద్దేశం రఘురామరాజుకు ఉందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.అయితే అరెస్టైన తరువాత బెయిల్పై బయటికి వచ్చిన రఘురామరాజు తన విమర్శనలను మానలేదు.
గతంలో మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా విమర్శిస్తే ఇప్పుడు కొత్తగా లేఖల ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు.ప్రతి రోజు సీఎం జగన్ మోహన్ రెడ్డికి రఘురామరాజు లేఖ పంపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ లేఖలో ప్రస్తావిస్తున్నారు. వృద్ధ్యాప్య పెన్షన్లు పెంపు, సీపీఎస్ రద్దు, పెళ్లికానుకలు,ఉద్యోగాలు భర్తీ లాంటి అంశాలపై లేఖలు రాశారు.అయితే తాజగా రఘురామరాజు సీఎంకు మరోలేఖ రాశారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని ఇచ్చిన హామీని నేరవేర్చి బాధితులను ఆదుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు.
మొత్తానికి రఘురామకృష్ణం రాజు మాత్రం వైసీపీ ప్రభుత్వంపై యుద్దం ప్రకటించినట్లుగానే కనిపిస్తుంది.మొన్నటి వరకు రచ్చబండ పేరుతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తే తాజా లేఖలతో మరోసారి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేపనిలో రఘురామరాజు ఉన్నారు.రఘురామకృష్ణం రాజు లేఖలను ప్రభుత్వం పట్టించుకుంటాదా లేదా అనేది పక్కనే పెడితే మీడియాలో మాత్రం రఘురామరాజు రోజు హైలెట్ అవుతుండటం విశేషం.