రైతులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే?
ఇప్పటికే పలు సీజన్లలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా లక్షల మంది రైతులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకంలో భాగంగా పెట్టుబడి సాయం అందుకొని లబ్ది పొందుతున్నారు. ఇక పోతే ఇక ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమై పంటలు వేసేందుకు రైతులందరూ సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రైతుల ఖాతాలలో రైతుబంధు లో భాగంగా పెట్టుబడి సాయాన్ని జమ చేసేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరి ఖాతాల్లో కూడా రైతుబంధు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ సీజన్లో 63 లక్షల 25 వేల ఆరు వందల 95 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఐదు వేల రూపాయల పెట్టుబడి సాయం అందుతుంది. ఇక ఇలా రైతులందరికీ పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 7,508.75 కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. గత యాసంగి తో పోల్చి చూస్తే ఇక ప్రస్తుతం ఈ సీజన్లో 2.81 లక్షల మంది కొత్త రైతులు ఈ పథకంలో లబ్ధి పొందుతున్నారు.