వావివరసలు మరిచిన అన్న.. చెల్లి ఏం చేసిందో తెలుసా?
తరచూ ఫుల్లుగా తాగి వచ్చి ఇక ఇంట్లో వాళ్లతో గొడవ పడుతూ ఉండేవాడు. ఇక అసభ్యకరంగా తిడుతూ వేధింపులకు గురి చేస్తూ ఉండేవాడు. ఇక ఇటీవలే మరో సారి ఫుల్లుగా మద్యం తాగి వచ్చిన సదరు యువకుడు ఇంట్లో మరోసారి గొడవ చేశాడు ఈ క్రమంలోనే ఇక ఇంట్లో ఒంటరిగా ఉన్న చెల్లిని అసభ్యంగా తిట్టడమే కాదు వావి వరసలు మరిచి దారుణంగా ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఇక మద్యం మత్తులో ఉన్న అన్నను కొద్ది సేపటి వరకూ వారించేందుకు ప్రయత్నించిన సదరు యువతి చివరికి సహనం కోల్పోయింది. దీంతో ఇంట్లో ఉన్న రోకలిబండతో అన్న తలపై గట్టిగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది విద్యానగర్‌కు చెందిన సతీష్ మద్యానికి బానిస అయిపోయాడు. కుటుంబ బాధ్యతలను వదిలేసి ఆవరాగా తిరుగుతూ ఉండేవాడు. ఇక తరచు మద్యం తాగి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవకు దిగి అసభ్యంగా తిరుగుతూ ఉండేవాడు. ఇక ఇటీవల రాత్రి సమయంలో మరోసారి మద్యం తాగి వచ్చిన సతీష్ ఇంట్లో పడుకుని ఉన్న చెల్లి తో అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే వావి వరసలు మరిచి మృగంలా ప్రవర్తిస్తున్న అన్న నుండి తప్పించుకునేందుకు యువతి ఎంత ప్రయత్నించినప్పటికీ వదలలేదు. చివరికి సహనం కోల్పోయిన యువతి ఇంట్లో ఉన్న రోకలిబండతో అన్న తలపై మోదింది దీంతో సతీష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.