కేసుల ఒత్తిడితోనే జగన్ ఢిల్లీ టూర్?

Chaganti
రెండు రోజుల జగన్ ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర సమస్యలు చర్చించారు అని తెలిసింది సంతోషం అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. రేపు 14 వతేదీన సీబీఐ కోర్టులో బెయిల్ అంశం రానున్నదని, అలా జగన్ పై కేసుల పై వత్తిడి వచ్చినప్పుడు ఆయన ఢిల్లీ టూర్ పెట్టుకుంటున్నారని అన్నారు. మూడు రాజధానులు,కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు అంటున్నారు..అవి కోర్టులో ఉన్న అంశాలన్న రవీంద్ర కుమార్ కర్నూల్ లో హైకోర్టు కు చర్యలు తీసుకోవాలని అన్నారు..అది కోర్టులో ఉందని అన్నారు. ప్రత్యేక హోదా అన్నారు..పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రులు చెప్పారు ప్రత్యేక హోదా లేదు అని ఆయన విమర్శించారు. 


ధర్మేంద్ర ప్రధాన్ విశాఖపట్నం స్టిల్ ప్లాంట్ అంశం, పెట్రో కెమికల్ అంశం పై కలిశాము అంటున్నారని, అలాగే జల్ శక్తి మంత్రిని 55 వేల కోట్లు కేటాయించాలని అడిగారు బాగానే ఉంది..మరి గతంలో నిధులు ఇవ్వొద్దు అని కేంద్రానికి లేఖ రాశారు.ఇప్పుడు ఇవ్వమని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. గజేంద్ర సింగ్ షెకావత్ ఏమో సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు అని అన్నారు..షేకవత్ దగ్గర జరిగిన సమావేశ వాస్తవాలు చెప్పడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రులకు ఇచ్చిన నోట్ ను బయటపెట్టాలి, కేంద్ర మంత్రులు ఎం చెప్పారో ప్రజాలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 


ప్రజలకు అనుమానాలకు జగన్ తావు ఇస్తున్నారని, సీబీఐ, ఈడీ కేసులు వస్తున్నాయి.. వాటిని స్లో చేయాలని అడగతున్నారో అని అనుమానలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్ర మంత్రులు మాత్రం కేసుల కోసం సీఎం ఢిల్లీ వెళ్ళలేదు అని అంటున్నారు. మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం దగ్గరికి వచ్చినప్పుడు అవి ప్రజాలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వం వాక్సిన్ వేస్ట్ చేసింది అని కూడా కేంద్రం చెబుతోందని కేంద్రం మీరు రాసిన లేఖ పై స్పందించకపోతే మీ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటని ప్రశ్నించారు. 


25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని అన్నారు. ఇప్పుడు  ప్రత్యేక హోదా అంశం లో కేంద్ర పై పోరు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వ్యక్తిగతం ,కేసుల కోసం ఆయన ఒక స్టంట్ చేస్తున్నారని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిందన్న ఆయన విశాఖ స్టిల్ ప్లాంట్ అంశంలో కేంద్రం  వెనక్కు వెళ్ళదని అని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసన్న ఆయన జగన్ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు రాష్టాన్ని తాకట్టు పెట్టొద్దని కోరారు. 

Find Out More:

Related Articles: