ఇప్పటికైనా చైనా సహకరిస్తే బెటర్ : భారత్

praveen
భారత్-చైనా సరిహద్దు లో గత కొన్ని రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఎంతో ప్రశాంతంగా ఉన్న సరిహద్దులను విస్తరణ కాంక్షతో నిషేధిత భూభాగంలో చైనా గుడారాలు ఏర్పాటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజులపాటు భారత్-చైనా సరిహద్దు లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా ఊహకందని విధంగా మారిపోయింది. ఈ క్రమంలోనే భారత్-చైనా సరిహద్దు లో తలెత్తిన వివాదాలను సద్దుమణిగేలా చేయడానికి అటు ఇరు దేశాల సైన్యాధికారుల మధ్య పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ చర్చల్లో ఒప్పందం చేసుకోవడం ఆ తర్వాత మాత్రం డబుల్ గేమ్ ఆడటం లాంటిది చేసింది చైనా.



 ఓవైపు సరిహద్దుల్లో మోహరించిన ఆయుధాలను ఉపసంహరించుకుంటానని అంటూ చర్చల్లో ఒప్పందం చేసుకుని.. మరోవైపు మరిన్ని మొహరింపు జరపడంతో భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తార స్థాయికి చేరుకున్నాయి.  ఇక మొన్నటికి మొన్న జరిగిన చర్చల్లో చివరికి ఇరు దేశాలు మధ్య ఒప్పందం కుదిరింది.  ఇటీవలే మరో సారి చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో అటు భారత్ కూడా అప్రమత్తం అవుతుంది. ఇక ఇటీవలే చైనా ఇప్పటికైనా సహకరించాలి అంటూ భారత్ సూచించింది.



 ప్రస్తుతం సరిహద్దుల్లో తలెత్తిన వివాదాన్ని సద్దుమణిగేలా చేసి శాంతి మార్గం సుగమం చేసేందుకు ప్రస్తుతం భారత్ ప్రయత్నిస్తోందని ఇలాంటి క్రమంలో చైనా సహకరించాల్సిన అవసరం ఉంది అంటూ భారత్ చెప్పుకొచ్చింది. గత కొన్ని రోజుల నుంచి భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన తూర్పు లడక్ సహా పలు ప్రాంతాల నుంచి చైనా బలగాలు ఇప్పటికైనా ఉపసంహరించుకుంటే బెటర్ అంటూ సూచించింది భారత్. ఈ మేరకు ఇటీవలే చైనా భారత్ మధ్య 11 వ దశ చర్చలు జరిగినట్లు విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇక ఈ పదకొండవ దశ చర్చల్లో చైనా భారత్ బలగాల నుంచి కమాండర్ స్థాయి అధికారులు పాల్గొన్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: