వాటర్ అనుకుని యాసిడ్ తాగాడు.. చివరికి?
ఇది కాస్తా సంచలనంగా మారిపోయింది. ఆయన చేసిన చిన్న పొరపాటు ప్రస్తుతం ఆయనను ఆస్పత్రి బెడ్ పైన పడుకోబెట్టింది. ఈ ఘటన జమ్మూకాశ్మీర్లో వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. జమ్మూకాశ్మీర్లో ఓ వ్యక్తి తహసిల్దార్ గా పని చేస్తున్నాడు. ఇక తహసిల్దార్ అన్న తర్వాత కొన్ని కొన్ని సార్లు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష జరపాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక్కడొక తహసిల్దార్ కూడా ఓ గ్రామానికి వెళ్ళాడు. అక్కడ తన పని పూర్తయిన తర్వాత దాహం వేయడంతో పక్కనే ఉన్న షాప్ దగ్గరికి వెళ్లి వాటర్ బాటిల్ కొన్నాడు.
అప్పటికి దాహంతో ఉన్న సదరు వ్యక్తి ఆ బాటిల్ మూత తెరవడమే ఆలస్యం గుటగుట నీళ్లు తాగేసాడు. కానీ తాగిన తర్వాత తెలిసింది ఏమిటంటే అది నీళ్లు కాదు యాసిడ్ అనేది నిజం. దీంతో నిమిషాల వ్యవధిలోనే అస్వస్థతకు గురయ్యాడు సదరు వ్యక్తి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి అతనిని ఆసుపత్రికి తరలించారు. అయితే నీళ్లు అనుకొని దుకాణదారుడు యాసిడ్ అందించడం కారణంగానే తాను తాగానని తహసిల్దార్ పోలీసులకు చెప్పడంతో ఇక పోలీసులు షాపు యజమాని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.