అస్తికల నిమజ్జనం.. ఇక ఆన్ లైన్ లో?
ఇలాంటి నేపథ్యం లో కరోనా వైరస్ బారిన పడి చనిపోయిన వారికి శాస్త్రబద్ధంగా, గౌరవప్రదంగా ఆస్తికల నిమజ్జనం చేయడానికి ఇప్పటికే అధికారులు ఎన్నో రకాల వినూత్నమైన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. ఇక ఇటీవల పోస్టల్ విభాగం కూడా వినూత్న కార్యక్రమానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సాధారణం గా ఎవరైనా చనిపోయిన తర్వాత వారి అస్తికలను పుణ్యనదుల్లో కలపాలని అలా కలిపితే వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది అని నమ్ముతూ వుంటారు చాలా మంది కాని ప్రస్తుతం కరోనా కాలంలో అది అసలు కుదరడం లేదు.
ఇలాంటి నేపథ్యం లో ఇటీవలే పోస్టల్ శాఖ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇకనుంచి కరోనా మృతుల అస్తికలను ఇక పుణ్యనదుల్లో కలిపేందుకు అవకాశం ఉంటుంది. వారణాసి, హరిద్వార్, ప్రయాగ్ రాజ్ లాంటి ప్రాంతాలలో ఉన్న పుణ్య నదుల్లో అస్తికలను నిమజ్జనం చేయనున్నట్లు ఓం దివ్యదర్శనం సభ్యులు తెలిపారు కరోనా కాలంలో తమ ప్రియమైన వారి ఆస్తికలు శాస్త్ర బద్ధంగా పుణ్య నదుల్లో కలపలేక పోతున్నారూ.. అనే బాధ ఎవరిలో ఉండకుండా పోస్టల్ విభాగం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలుస్తుంది. దేశంలోని నలుమూలల నుంచి అస్తికలను పోస్టాఫీసు ద్వారా వారణాసి సహా ఇతర ప్రాంతాలకు పంపేందుకు వీలుంది