థర్డ్ వేవ్ కి సిద్ధమవుతున్న ఏపీ.. ఏం చేస్తుందంటే?
ప్రతి రోజు 25 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు వెలుగులోకి రావడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసుల సంఖ్య ఇలాగే కొనసాగితే పరిస్థితి చేయి దాటి పోయే ప్రమాదం ఉంది అని భావించిన ప్రభుత్వం 18 గంటల పాటు కఠినమైన కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అదుపులోకి వస్తుంది. ఇలాంటి తరుణంలో మరికొన్ని రోజుల్లో థర్డ్ వేవ్ విజృంభించే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ దీనికి సిద్ధం కావాలి అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలపై తాజాగా వైరస్ ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది అని చెబుతున్నారు నిపుణులు.
ఈ క్రమంలోనే మూడవ దశ కరోనా వైరస్ వ్యాప్తి పై అంచనా వేయడం మొదలు పెట్టింది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తదుపరి చిన్న పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీంతో థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తోంది వైరస్. మరికొన్ని రోజుల్లో పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు వ్యాక్సిన్ విషయంలో ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర వైద్య శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న మెడికల్ ఎక్విప్ మెంట్ లో కూడా స్వల్ప మార్పులు చేసి చిన్నారులకు ఉపయోగపడేలా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం చిన్నపిల్లలకు కరోనా మందులు టాబ్లెట్స్ రూపంలో కాకుండా సిరప్ రూపంలో అందించేందుకు సన్నాహాలు చేస్తోంది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ.