సినిమా
ఇండస్ట్రీ లో వరుస పెట్టి ఎవరికైతే విజయాలు దక్కుతాయో వారికి అద్భుతమైన సినిమాలలో అవకాశాలు దక్కుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది అనేక సార్లు కరెక్ట్ అని ప్రూవ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఏ ముద్దు గుమ్మ అయితే
ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకొని , ఆ తర్వాత కూడా వరుస పెట్టి విజయాలను అందుకుంటుందో ఆమెకు సూపర్ సాలిడ్ క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతాయి. ఇకపోతే వరుసగా తెలుగు
సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాలుగు విజయాలను అందుకున్న ఓ ముద్దుగుమ్మ ఒక ఫ్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొంది. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు ... మోస్ట్
బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి సంయుక్త మీనన్. ఈమె పవన్
కళ్యాణ్ ,
రానా హీరోలుగా రూపొందిన భీమ్లా
నాయక్ అనే సినిమాతో
టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ
మూవీ లో ఈమె
రానా కు
భార్య పాత్రలో నటించింది. ఈ
మూవీ మంచి విజయం సాధించింది. ఈ
సినిమా తర్వాత ఈమె నటించిన బింబిసారా , సార్ , విరూపాక్ష సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.
ఇలా పరుసగా ఈమె నటించిన నాలుగు తెలుగు సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఆ తర్వాత ఈమె
కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన డెవిల్ అనే
మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ
సినిమా తర్వాత ఈమె చాలా కాలం గ్యాప్ తీసుకుంది. తాజాగా ఈమె అఖండ 2 అనే
మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ
మూవీ డిసెంబర్ 5 వ తేదీన విడుదల కానుంది. తాజాగా ఈ
బ్యూటీ నిఖిల్ హీరోగా రూపొందిన స్వయంభు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ
మూవీ ని వచ్చే సంవత్సరం
ఫిబ్రవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ రెండు
మూవీ లతో ఈమె ఏ స్థాయి విజయాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.