భీమా డబ్బులకోసం కక్కుర్తి.. మాజీ కౌన్సిలర్ భర్త ఏం చేసాడో తెలుసా?
భీమా డబ్బులు కోసం కనీసం మానవత్వాన్ని మరిచి పోతున్నారు. అదే సమయం లో ఏకంగా వివిధ కారణాలతో చని పోయిన వారిని ప్రమాదాల బారిన పడి చని పోయారు అని చిత్రీకరించడానికి కూడా ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది. ఇటీవలే హైదరాబాద్ నగరం లో మాజీ కౌన్సిలర్ లీలావతి అనే 55 ఏళ్ల మహిళ గుండె పోటుతో మరణించారూ. కానీ గుండె పోటుతో మరణిస్తే భీమా డబ్బులు రావు అని భావించిన భర్త ఇక భార్య సహజ మరణాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.
జగ్గయ్య పేట తీసుకువచ్చి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. షేర్ మహమ్మద్ పేట క్రాస్రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగిందని ఒక పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు. అయితే ఫిర్యాదు పై అనుమానం వచ్చిన పోలీసులు తమ దైన శైలిలో విచారణ జరపగా తీగ లాగితే డొంక కదిలినట్లు పూర్తి సమాచారం బయటకు వచ్చింది. లీలావతి రోడ్డు ప్రమాదం లో కాదు గుండె పోటుతో మృతి చెందిన విషయం భర్త కాంతారావు ఒప్పుకున్నాడు. ఈ క్రమం లోనే లీలావతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.