మూడు నెలలు ఫ్రీ ఇంటర్నెట్.. ఈ మెసేజ్ వచ్చిందా?

praveen
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ గా మారిపోతున్నాయి. కొన్ని రకాల మెసేజ్ లు అయితే అందరిని ఆకర్షించే విధంగా ఉన్నాయి. అయితే ఇక సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న వార్తల్లో ఏది నిజమో ఏది అబద్దమో కూడా తెలుసుకోవడం చాలా కష్టం గా మారిపోతుంది. ఇకపోతే ఇటీవలే మరో ఒక మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  10 కోట్ల మంది వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మూడు నెలల పాటు ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తుందని.. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అంటూ ఒక వార్త ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది.



 అయితే ఇది నిజమే అనుకున్నారు అందరు కానీ ఇతర ఇటీవలే పీ ఐబీ సోషల్ మీడియా వేదికగా ఇది ఫేక్ మెసేజ్ అంటూ తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఫ్రీగా ఇంటర్నెట్తో ఇస్తున్నట్లుగా ఎలాంటి ప్రకటన రాలేదు అంటు ధృవీకరించింది. వినియోగదారులను మోసగించడానికి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఇలాంటి ప్రమాదకరమైన లింకులను సోషల్ మీడియాలో ఉంచినట్లు పి ఐ బి గుర్తించింది. దీని గురించి ప్రతి ఒక్కరు ఇతరులకు తెలియజేయాలి అంటే సూచించింది. పొరపాటున ఇలాంటి లింక్ పై క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం మొత్తం దొంగలించ పడుతుంది అని తెలిపింది.



 దీనికి సంబందించిన  ఒక చిన్న వీడియోను కూడా విడుదల చేసింది పీఐబీ అయితే ఇలాంటి మెసేజ్లు వాట్సాప్లో సర్క్యులేట్ కావడం ఇదే మొదటి సారి ఏమీ కాదు. గతంలో పింక్ వాట్సాప్ పేరుతో ఒక మెసేజ్ కూడా ఎంతగానో సర్క్యూలెట్ అయింది   ఇలా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అటు నెటిజన్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు ఖాతాలు ఖాళీ చేసేందుకు సైబర్ నేరగాళ్లు ఏదో ఒక విధంగా ఆకర్షణీయమైన మెసేజ్ లతో నేరాలకు పాల్పడుతున్నారు. అందుకే ప్రజలు అందరూ కొన్ని రకాల లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: