ఫోన్ ఇవ్వండి.. లేదంటే క్రిమినల్ కేసే!

Chaganti
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడికి వెళ్లిన ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక తన అరెస్టు విషయంలో అరెస్ట్ చేసిన అనంతరం తనను చిత్రహింసలు పెడుతూ థర్డ్ డిగ్రీ కూడా తన మీద అమలు చేశారని చెబుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా హోంమంత్రి అమిత్ షా తో పాటు తన సహచర ఎంపీలు అందరికీ ఆయన లేఖలు కూడా రాశారు. 


తాజాగా సిఐడి అడిషనల్ డిజి సునీల్ కుమార్ కి రఘురామకృష్ణంరాజు లీగల్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.. తన అరెస్టు వ్యవహారంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఐ ఫోన్ వెంటనే తిరిగి ఇవ్వాలని నోటీసులో ఎంపీ పేర్కొన్నారు. తనను అరెస్టు చేసిన సమయంలో ద్వాదీనం చేసుకున్న ఈ ఫోన్ ఎక్కడా అరెస్ట్ రికార్డుల్లో చూపించ లేదనే విషయాన్ని కూడా ఆయన నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.


 సదరు ఫోన్ లో తన కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయని అలాగే స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నప్పుడు తనకు సంబంధించిన చాలా విలువైన సమాచారం ఫోన్లో ఉందని పేర్కొన్నారు. పార్లమెంట్ విధులు నిర్వర్తించటానికి గాను సదరు ఫోన్ వెంటనే ఇవ్వాలని నోటీసులు ఆయన పేర్కొన్నారు. ఒకవేళ తిరిగి ఫోన్ ఇవ్వ లేనిపక్షంలో సివిల్ సహా క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని లీగల్ నోటీసు లో రఘురామ రాజు హెచ్చరించారు. అయితే ఈ అంశం మీద ఇంకా సునీల్ కుమార్ స్పందించలేదు. ఆయన ఏమని సమాధానం ఇస్తారు అనే దాని మీద ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: