లాక్ డౌన్ ఎఫెక్ట్.. లిక్కర్ దొరక్క.. మందుబాబులు ఏం చేసారో తెలుసా?

praveen
ప్రస్తుతం ఆన్లైన్ ప్రపంచం నడుస్తోంది. ఏ విషయం కావాలన్నా యూట్యూబ్ లో వెతికి  తెలుసు కుంటున్నారు ఎంతో మంది  వెరసి రోజు రోజుకు ఈ మధ్య కాలం లో యూట్యూబ్లో అన్ని సమాచారం ఉండడం తో ఎంతో మందికి ఎంతగానో ఉపయోగ పడుతుంది  కానీ ఈ మధ్య కాలం లో ఎంతో మంది యూట్యూబ్ లో కొన్ని విషయాలను నేర్చుకుని వాటి ద్వారా ఎన్నో నేరాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది..

 ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం కారణం గా దాదాపు అన్ని రాష్ట్రాలలో కూడా లాక్ డౌన్ అమలు అవుతుంది. లాక్ డౌన్ సమయం లో మద్యం దుకాణాలు కూడా మూత బడ్డాయి. దీంతో మందు బాబులు మద్యం దొరక్క అల్లాడి పోతున్నారు.  ఇలా కొన్ని రోజుల పాటు మద్యం దొరక్క ఇబ్బందులు పడిన మందు బాబులు ఎక్కడో ఉన్నా మద్యం దుకాణం పై ఆధార పడటం ఎందుకు తామే స్వయం గా మద్యం తయారు చేసుకుంటే సరి పోతుంది కదా అనుకున్నారు.  అనుకున్నదే తడవుగా యూట్యూబ్ వేదికగా మద్యం ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని తెలుసు కున్నారు.

 ఇక ఆ తర్వాత ఊరుకుంటారా ఏకంగా మద్యం తయారు చేశారు. చివరికి పోలీసులకు ఈ సమాచారం తెలియడం తో కటకటాల పాలయ్యారు.  తమిళనాడు లో వెలుగు లోకి వచ్చింది ఈ ఘటన. తమిళనాడుకు చెందిన తండ్రీ కొడుకులు ఇద్దరూ కూడా లాక్‌డౌన్‌ సమయం లో యూట్యూబ్ లో చూసి మద్యం తయారు చేసేందుకు ప్రయత్నించి చివరికి పోలీసులకు దొరికి జైలుపాలయ్యారు. యూట్యూబ్ లో చూసి రోజు మద్యం తయారు చేసి  వారు తాగిన తర్వాత మిగిలిన మొత్తాన్ని విక్రయిస్తున్నారు. ఇక కీలక సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి ప్రస్తుతం విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: